కువైట్ సాహెల్ యాప్‌లో ఎంట్రీ, ఎగ్జిట్ నోటిఫికేషన్లు..!!
- November 12, 2026
కువైట్: కువైట్ లోకి ప్రవేశించినప్పుడు, ఇక్కడి నుంచి బయటకు వెళ్లినప్పుడు ప్రయాణికులకు సమాచారం అందించే కొత్త సేవను కువైట్ హోం మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. ప్రభుత్వ సేవల కోసం ఉపయోగించే ‘సాహెల్ (Sahl)’ యాప్‌లో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఈ సేవ ద్వారా కువైట్ పౌరులు, ప్రవాసులు దేశంలోని సరిహద్దు వద్ద ఎంట్రీ, ఎగ్జిట్ కేంద్రాల ద్వారా తమ రాకపోకలకు సంబంధించిన వివరాలను నేరుగా యాప్‌లో తెలుసుకోవచ్చు. ప్రయాణానికి సంబంధించిన సమాచారం, ప్రభుత్వ సేవలకు సంబంధించిన వివరాలను కూడా సులభంగా పొందవచ్చని హోం మంత్రిత్వ శాఖ తన అధికారిక ఎక్స్ (X) ఖాతాలో వెల్లడించింది.
అంతేకాకుండా, యాప్‌లో కనిపించే ప్రయాణ వివరాల్లో ఏవైనా తప్పులు లేదా వ్యత్యాసాలు ఉంటే వినియోగదారులు వాటిని అధికారులకు నివేదించే అవకాశం కూడా కల్పించారు. దీంతో తమ ప్రయాణ రికార్డులను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడంతోపాటు, వివరాల్లో పొరపాట్లు ఉంటే సరిచేసుకునేందుకు వీలుంటుంది.
ఈ కొత్త సేవతో కువైట్‌లో నివసిస్తున్న పౌరులు, ప్రవాసులకు ప్రయాణ వివరాలను తెలుసుకోవడం మరింత సులభతరం కానుంది.
తాజా వార్తలు
- కువైట్ సాహెల్ యాప్‌లో ఎంట్రీ, ఎగ్జిట్ నోటిఫికేషన్లు..!!
- ఒమన్ లాజిస్టిక్స్ రంగంలో భారీ వృద్ధి..!!
- ఖతార్‌లో 57 ఫుడ్ కేంద్రాలు మూసివేత..!!
- సౌదీలో వినియోగదారుల హక్కుల చట్టం.. ఉల్లంఘిస్తే SR8 మిలియన్ల ఫైన్, రెండేళ్ల జైలు శిక్ష..!!
- యూఏఈలో వర్షాకాలానికి షార్జా భారీ ఏర్పాట్లు..!!
- బహ్రెయిన్ నేషనల్ డే.. వ్యాపారులకు ప్రత్యేక రాయితీలు..!!
- పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ వేగానికి పారిశ్రామిక దిగ్గజాల ప్రశంసలు
- SBI ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి డాలస్ లో మహాత్మాగాంధీకి ఘన నివాళి
- గ్లోబల్ విలేజ్‌ను సందర్శించిన దుబాయ్ రూలర్ షేక్ మహమ్మద్
- నకిలీ అటెస్టేషన్ సేవల పై భారతీయులకు సౌదీ అరేబియాలోని భారత రాయబార కార్యాలయం హెచ్చరిక







