ఈ ఏడాది క్యాంపింగ్ సీజన్ ప్రారంభమవుతుందా?
- November 13, 2026
కువైట్: ఈ ఏడాది క్యాంపింగ్ సీజన్‌ను ప్రారంభించాలా? లేక రద్దు చేయాలా? అనే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కువైట్ మున్సిపాలిటీ ప్రకటించింది. భద్రత, ప్రజల రక్షణకు సంబంధించిన పరిస్థితులను సంబంధిత అధికారులతో కలిసి నిశితంగా పరిశీలిస్తున్నట్లు వెల్లడించింది.
క్యాంపింగ్ సీజన్ ప్రారంభ తేదీపై లేదా క్యాంప్ స్థలాల కోసం అనుమతుల దరఖాస్తుల స్వీకరణపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదని మున్సిపాలిటీ స్పష్టం చేసింది. అధికారిక ప్రకటన వెలువడకముందే క్యాంపులు ఏర్పాటు చేయడం, క్యాంపింగ్ స్థలాలను సిద్ధం చేయడం నిబంధనలకు విరుద్ధమని హెచ్చరించింది. ప్రజలు నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, క్యాంపింగ్ ఏర్పాట్ల కోసం అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి ఉండాలని సూచించింది.
తాజా వార్తలు
- GMU మెడికల్ అండ్ సైన్స్ ఎగ్జిబిషన్‌కు 10 వేల మందికి పైగా విద్యార్థులు
- బిట్స్ పిలానీ దుబాయ్‌లో డే టైమ్ ఎంబీఏ తరగతులు ప్రారంభం
- ప్రధాని మోదీ చేతుల మీదుగా బెంగళూరు మెట్రో పింక్ లైన్ ప్రారంభం
- దుబాయ్‌లో నవంబర్ 21, 22 తేదీల్లో నగరవ్యాప్త ధ్యాన కార్యక్రమం
- ఒమన్ రాయల్ హాస్పిటల్‌కు యూరోపియన్ గుర్తింపు..!!
- హౌతీల దాడులు, ప్రాంతీయ భద్రతపై సౌదీ–చైనా చర్చలు..!!
- ఇజ్రాయెల్ దాడిని తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- పెన్షన్ పొందే వయోపరిమితి పెంపునకు షురా కౌన్సిల్ బ్రేక్..!!
- యూఏఈలో Dh69 నుంచే ఫ్లూ టీకాలు.. బీమా ఉన్నవారికి ఉచితం..!!!
- కువైట్‌లో స్కూళ్లు, ఆఫీసులకు రవాణా కష్టాలు..!!







