యూఏఈ నేషనల్ డే సెలవులు ప్రకటన..

- November 13, 2026 , by Maagulf
యూఏఈ నేషనల్ డే సెలవులు ప్రకటన..

డిసెంబర్ 2, 3 తేదీల్లో అధికారిక సెలవులు..డిసెంబర్ 7 నుంచి యథావిధిగా ప్రభుత్వ కార్యాలయాల కార్యకలాపాలు

అబుధాబి: యూఏఈ 55వ నేషనల్ డే (Eid Al Etihad) సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులను ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు మూడు రోజుల పాటు వేతనంతో కూడిన సెలవు లభించనుంది.

ప్రభుత్వ ప్రకటన ప్రకారం డిసెంబర్ 2, బుధవారం, డిసెంబర్ 3, గురువారం రోజులను అధికారిక సెలవులుగా ప్రకటించారు.అనంతరం డిసెంబర్ 7, సోమవారం నుంచి మంత్రిత్వ శాఖలు, ఫెడరల్ ప్రభుత్వ సంస్థలు యథావిధిగా తమ కార్యకలాపాలను కొనసాగించనున్నాయి.

1971లో యూఏఈ ఏడు ఎమిరేట్లు ఏకమై దేశంగా ఏర్పడింది.ఈ ఏడాది దేశం 55వ జాతీయ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకోనుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com