బాధ్యులను జవాబుదారీగా నిలపాలని కోరింది.

- November 14, 2026 , by Maagulf
బాధ్యులను జవాబుదారీగా నిలపాలని కోరింది.
కైరో: హౌతీ మిలీషియా తన సైనిక కార్యకలాపాలను, దాడులను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ఐక్యరాజ్యసమితి(UNO} భద్రతా మండలి ఆమోదించిన తీర్మానం 2837ను అరబ్ పార్లమెంట్ స్వాగతించింది. సౌదీ అరేబియాపై దాడులు, పౌరులు, వాణిజ్య విమానాశ్రయాలు, అంతర్జాతీయ సముద్ర రవాణాను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని ఈ తీర్మానం స్పష్టం చేసింది.
 
 అరబ్ పార్లమెంట్ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం అంతర్జాతీయ సమాజం హౌతీల కార్యకలాపాల తీవ్రతను, వాటి వల్ల ప్రాంతీయ భద్రత, స్థిరత్వం, అంతర్జాతీయ నౌకాయాన స్వేచ్ఛకు ఎదురవుతున్న ముప్పును గుర్తించిందనడానికి నిదర్శనమని పేర్కొంది. హౌతీల ఉగ్రవాద చర్యలు, నిరంతర ఉల్లంఘనలకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దేశాలన్నీ ఏకతాటిపైకి రావడానికి ఈ తీర్మానం కీలక ముందడుగు అని అభివర్ణించింది. కేవలం ఖండనలకే పరిమితం కాకుండా దాడులను అరికట్టేందుకు కఠినమైన, ఆచరణాత్మక చర్యలు తీసుకోవాలని, 
హౌతీ మిలీషియాతో సంబంధం ఉన్న సంస్థలపై విధించిన ఆంక్షలను పొడిగించడాన్ని కూడా అరబ్ పార్లమెంట్ స్వాగతించింది. యెమెన్‌తో పాటు విస్తృత ప్రాంతంలో భద్రత, స్థిరత్వానికి ముప్పు కలిగించే కార్యకలాపాలను అడ్డుకోవడానికి ఈ చర్యలు అవసరమని పేర్కొంది. యెమెన్‌లో చట్టబద్ధమైన ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధమైన బాధ్యతలను నిర్వహించే అవకాశం కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలకు తమ మద్దతు ఉంటుందని పునరుద్ఘాటించింది. దేశ ఐక్యత, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను కాపాడటంతో పాటు యెమెన్ ప్రజల భద్రత, శాంతి, స్థిరత్వం, అభివృద్ధి ఆకాంక్షలను నెరవేర్చాలని పేర్కొంది.
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com