బహ్రెయిన్‌లో మోగిన ప్రమాద హెచ్చరిక సైరన్లు..!!
- November 15, 2026
మనామా: బహ్రెయిన్‌లో ఆదివారం (నవంబర్ 15) తెల్లవారుజామున ప్రమాద హెచ్చరిక సైరన్లు మోగాయి. దేశ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of Interior) వరుసగా రెండు హెచ్చరికలు జారీ చేసింది.
దేశంలో ముప్పు పొంచి ఉందంటూ ప్రజలను అప్రమత్తం చేసిన మంత్రిత్వ శాఖ.. పౌరులు, నివాసితులు ప్రశాంతంగా ఉండాలని సూచించింది. వెంటనే సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, అధికారిక సమాచార మార్గాల ద్వారా తాజా వివరాలను తెలుసుకోవాలని కోరింది.
అయితే, ఈ ముప్పు స్వరూపం ఏమిటనే విషయాన్ని మంత్రిత్వ శాఖ వెల్లడించలేదు. మరోవైపు, బహ్రెయిన్ గగనతలంలోకి ప్రవేశించిన డ్రోన్లను దేశ వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు స్థానిక మీడియా తెలిపాయి. కాగా, అధికారిక ప్రకటనలు వచ్చే వరకు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో భారతీయుల కోసం కొత్త ప్రాపర్టీ యాప్..!!
- బహ్రెయిన్‌లో మోగిన ప్రమాద హెచ్చరిక సైరన్లు..!!
- యూఏఈలో క్యాంపింగ్ సీజన్ సందడి.. ఒక్కరోజు ట్రిప్‌కు Dh300..!!
- సౌదీలో అక్రమ నివాసితులపై భారీ చర్యలు..!!
- బహ్రెయిన్‌లో హై అలర్ట్.. దేశవ్యాప్తంగా భద్రతా హెచ్చరికలు జారీ..
- ఫుజైరా ఘోర రోడ్డు ప్రమాదం.. మృతుల్లో 13 ఏళ్ల భారతీయ బాలుడు..
- హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..
- బహ్రెయిన్‌లో విదేశీ డ్రైవర్లకు షాక్..!!
- ఒమన్‌లో పర్సనల్ స్టేటస్ చట్టంలో కీలక నిబంధనలు..!!
- ద్వైపాక్షిక సహకారంపై సౌదీ–అమెరికా చర్చలు..!!







