కువైట్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!

- November 16, 2026 , by Maagulf
కువైట్‌లో ఆరుగురు ఆసియా దేశస్థుల అరెస్ట్..!!

కువైట్ : కువైట్‌లోని హవల్లీ ప్రాంతంలో అక్రమంగా గ్యాబ్లింగ్ నిర్వహిస్తున్నారనే ఆరోపణలపై ఆరుగురు ఆసియా దేశస్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మంత్రిత్వ శాఖకు చెందిన క్రిమినల్ సెక్యూరిటీ విభాగం ఆధ్వర్యంలో జనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఈ దాడులు నిర్వహించారు. మానవ అక్రమ రవాణా, అసాంఘిక కార్యకలాపాల నిరోధక విభాగం కూడా ఈ ఆపరేషన్‌లో పాల్గొంది.

హవల్లీ ప్రాంతంలో కొందరు వ్యక్తులు అక్రమ గ్యాబ్లింగ్ కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో జూదం నిర్వహిస్తున్న ప్రదేశాన్ని గుర్తించి, అక్కడ కార్యకలాపాలు జరుగుతున్న సమయంలోనే ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు. అరెస్టయిన ఆరుగురిని, స్వాధీనం చేసుకున్న వస్తువులను తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం సంబంధిత అధికారులకు అప్పగించినట్లు తెలిపారు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com