చార్మినార్ పరిసరాల్లో నకిలీ వెండి వర్క్ తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు
- November 18, 2026
నాలుగు యూనిట్ల పై కేసులు నమోదు.. 49 బండిళ్ల నకిలీ వెండి రేకులు, 10 కిలోలకు పైగా అల్యూమినియం స్వాధీనం
హైదరాబాద్: నగరంలోని చార్మినార్ పరిసర ప్రాంతాల్లో నకిలీ వెండి వర్క్ (Silver Leaf) తయారీ కేంద్రాల పై పోలీస్ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. స్థానిక పోలీసులతో కలిసి కమిషనర్ టాస్క్‌ఫోర్స్ చేపట్టిన ఈ తనిఖీల్లో నాలుగు యూనిట్లలో అక్రమ తయారీ కార్యకలాపాలు గుర్తించారు. ఈ మేరకు నాలుగు కేసులు నమోదు చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంఎస్ ఇత్తెహాద్ వర్క్ షాప్ యజమాని మహమ్మద్ అక్బర్, హుస్సేనీ ఆలం పరిధిలోని యూటీసీ సిల్వర్ లీఫ్స్ యజమాని మహమ్మద్ వలీ ఉద్దీన్, మొగల్‌పురా పరిధిలోని ఎంఏ మెట్రో వర్క్ షాప్ యజమాని మహమ్మద్ షరీఫ్, ఫలక్‌నుమా పరిధిలోని బీబీకా చష్మాలో ఉన్న తారా యూనిట్ యజమాని మహమ్మద్ జలీల్ ఖాన్‌లపై కేసులు నమోదు చేశారు.
ఈ దాడుల్లో 49 బండిళ్ల నకిలీ అల్యూమినియం వెండి రేకులు, 10 కిలోలకు పైగా అల్యూమినియం రేకులు, నకిలీ వెండి పూత పూసిన చక్కెర గుళికలు, ఖివామ్, పొగాకు, పాన్ చట్నీలు, జంతువుల చర్మపు షీట్లు, తయారీకి ఉపయోగించే యంత్రాలు, ఇతర పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ యూనిట్ల నిర్వాహకులు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఉత్తరప్రదేశ్ నుంచి అల్యూమినియం రేకులను కొనుగోలు చేసి, వాటితో తయారు చేసిన నకిలీ వెండి వర్క్‌ను తెలంగాణ వ్యాప్తంగా స్వీటు షాపులు, బేకరీలు, పాన్ షాపులకు అసలైన వెండిగా విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. పండుగల సమయంలో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంటుందని పోలీసులు తెలిపారు.
ఆహార పదార్థాలపై ఉపయోగించే వెండి రేకులు 99.9 శాతం స్వచ్ఛత కలిగి ఉండాలని, వాటిలో జంతు సంబంధిత పదార్థాలు ఉండకూడదని ఆహార భద్రతా నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అయితే నిబంధనలకు విరుద్ధంగా తయారు చేస్తున్న ఈ నకిలీ ఉత్పత్తులు ప్రజల ఆరోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
అల్యూమినియం కలిసిన ఉత్పత్తులను దీర్ఘకాలం తీసుకోవడం వల్ల మూత్రపిండాలు, నాడీ వ్యవస్థ, ఎముకలపై ప్రతికూల ప్రభావాలు పడే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.
తాజా వార్తలు
- Ras Al Khaimah named world’s No. 1 city for expats in 2026
- తాయిఫ్ గవర్నర్‌తో భారత కాన్సుల్ జనరల్ ఫహద్ సూరి భేటీ
- చార్మినార్ పరిసరాల్లో నకిలీ వెండి వర్క్ తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు
- యూఏఈ నేషనల్ డేకి షార్జా ప్రభుత్వ ఉద్యోగులకు ఐదు రోజుల సెలవులు
- తెలంగాణలో SIR గడువు మళ్లీ పొడిగించిన ఎన్నికల సంఘం
- ఒమన్‌లో వాహనాలు, కంప్యూటర్ల చోరీ.. నిందితుడి అరెస్ట్..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాల హెచ్చరిక.. అలర్ట్ జారీ..!!
- బహ్రెయిన్‌లో చిల్డ్రన్ డే..ప్రత్యేక అవసరాలున్న చిన్నారులతో భారత రాయబారి..!!
- దుబాయ్ ఎయిర్‌పోర్టులో ‘ఫ్యాషన్ అవెన్యూ’..!!
- ఖతార్ లో సముద్ర విజ్ఞానంపై చిన్నారులకు ప్రత్యేక శిక్షణ..!!







