సౌదీ–కువైట్ నేతల మధ్య కీలక చర్చలు
- November 23, 2026
రియాద్: సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్, ప్రధానమంత్రి ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్, కువైట్ ఎమిర్ షేక్ మిషాల్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్‌తో సోమవారం ఫోన్‌లో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడం, పరస్పర సహకారాన్ని విస్తరించడం, ప్రాంతీయ పరిణామాలపై ఇరువురు నేతలు చర్చించారు.
ఈ ఫోన్ సంభాషణ సందర్భంగా ఇరువురు నేతలు పరస్పరం శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. సౌదీ రాజు కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ తరఫున కువైట్ ఎమిర్‌కు క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
గల్ఫ్ ప్రాంతంలో సౌదీ అరేబియా, కువైట్ మధ్య ఉన్న సన్నిహిత సంబంధాలు, పరస్పర సహకారం నేపథ్యంలో ఇరువురు నేతల మధ్య జరిగిన ఈ సంభాషణకు ప్రాధాన్యత ఏర్పడింది.
తాజా వార్తలు
- ఎన్విడియా సీఈవోగా మళ్లీ జెన్సన్ హువాంగ్
- సౌదీ–కువైట్ నేతల మధ్య కీలక చర్చలు
- బుల్లెట్ రైలు ట్రయల్ రన్ పై అశ్విని వైష్ణవ్ కీలక అప్డేట్
- యూఏఈ 55వ ఈద్ అల్ ఎతిహాద్ వేడుకలకు ఐదు రోజుల సంబరాలు..
- ఆఫీసు కంప్యూటర్లలో వాట్సాప్ వాడకంపై కేంద్రం హెచ్చరిక
- తమకు జరిగిన నష్టానికి అమెరికా బాధ్యత వహించాలి: ఇరాన్
- యూఏఈలో ప్రభుత్వ సేవలకు ఏఐ అసిస్టెంట్ ‘మీరా’..!!
- ఒమన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి, 17 మందికి గాయాలు..!!
- కువైట్‌లో నవంబర్ 30న అంతర్జాతీయ స్టార్టప్ పోటీ..!!
- బహ్రెయిన్‌లో సందడిగా న్యూ ఇండియన్ స్కూల్ వార్షికోత్సవం..!!







