ఉమ్ అల్ ఖువైన్లో ట్రక్కుల రాకపోకలపై నిషేధం..!!
- November 24, 2026
ఉమ్ అల్ ఖువైన్: యూఏఈలోని ఉమ్ అల్ ఖువైన్ ఎమిరేట్‌లో ట్రక్కుల రాకపోకలపై కొత్త ఆంక్షలు విధించారు. డిసెంబర్ 1 నుంచి ఎగ్జిట్ 103 మార్గంలో ట్రక్కుల ప్రవేశాన్ని నిషేధించనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఉమ్ అల్ థువూబ్ ఇండస్ట్రియల్ ఏరియాకు వెళ్లే ఎగ్జిట్ 103 ప్రవేశ మార్గంలో ఈ నిషేధం అమలు కానుంది. ఈ మేరకు పోలీసులు ఆన్లైన్ నోటీసు ద్వారా ట్రక్కు డ్రైవర్లకు సమాచారం అందించారు.
నిషేధాన్ని ఉల్లంఘించే ట్రక్కులను గుర్తించేందుకు ప్రవేశ మార్గంలో 'నో ట్రక్స్' బోర్డుతో పాటు ట్రాఫిక్ కెమెరాను కూడా ఏర్పాటు చేశారు. ఈ మార్గాన్ని ఉపయోగించే ట్రక్కు డ్రైవర్లు ప్రత్యామ్నాయంగా ఎగ్జిట్ 110 ద్వారా తిరిగి, ఫ్రీజోన్ ప్రవేశ మార్గం నుంచి ఉమ్ అల్ థువూబ్ ఇండస్ట్రియల్ ఏరియాకు వెళ్లాలని అధికారులు సూచించారు.
ఉల్లంఘిస్తే Dh1,000 జరిమానా
యూఏఈలో భారీ వాహనాల రాకపోకలపై ట్రాఫిక్ నియంత్రణలు కొత్తేమీ కాదు. రహదారులపై వాహనాల రద్దీని తగ్గించడం, ఇతర వాహనదారుల భద్రతను నిర్ధారించడం లక్ష్యంగా ఈ ఆంక్షలు విధిస్తున్నారు. నిషేధిత రహదారులు, ప్రాంతాల్లో భారీ వాహనాలను నడిపినా లేదా ప్రవేశించినా యూఏఈ చట్టాల ప్రకారం Dh1,000 జరిమానాతో పాటు నాలుగు బ్లాక్ పాయింట్లు విధించే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగా, దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) కూడా ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి అల్ ఖుద్రా స్ట్రీట్, అల్ మైదాన్ స్ట్రీట్, అన్ని క్రాసింగ్‌లు, ఎయిర్పోర్ట్ టన్నెల్‌తో సహా పలు ప్రధాన రహదారులపై ట్రక్కులకు 24 గంటల నిషేధం అమలు చేస్తోంది. షేక్ జాయెద్ రోడ్, బీరూట్ స్ట్రీట్‌తో పాటు అల్ మిజార్, ముహైస్నా, ఔద్ అల్ ముతీనా వంటి నివాస ప్రాంతాల్లో రోజుకు 16 గంటల పాటు, ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉన్నాయి.
అలాగే ఎయిర్పోర్ట్ స్ట్రీట్, ఒమన్ స్ట్రీట్, డమాస్కస్ స్ట్రీట్లలో ఉదయం 6.30 నుంచి 8.30 వరకు, మధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వరకు, సాయంత్రం 5.30 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రక్కుల రాకపోకలను నిషేధించారు. ఈ నిబంధనలపై ట్రక్కు డ్రైవర్లు, రవాణా సంస్థలు, సరుకు రవాణా కంపెనీలకు అవగాహన కల్పించేందుకు దుబాయ్ పోలీసులు, ఆర్టీఏ సంయుక్తంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
తాజా వార్తలు
- రాస్ అల్ ఖైమాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బస్సు, ట్రక్కు ఢీకొని 11 మంది మృతి..!!
- ఉమ్ అల్ ఖువైన్లో ట్రక్కుల రాకపోకలపై నిషేధం..!!
- కువైట్‌లో 360 మాల్ సమీపంలో రోడ్ మూసివేత..!!
- ఒమన్‌లో జ్యువెలరీ కొనుగోలుదారులకు ఊరట..!!
- సౌదీ అరేబియాలో ఒకే నెలలో భారీగా ఆరిజిన్ సర్టిఫికెట్లు జారీ..!!
- బహ్రెయిన్‌లో రెస్టారెంట్ మేనేజర్‌కు మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఖతార్‌లో పర్యాటకులకు QR150 ఉచిత ఇంధన వోచర్లు..!!
- దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో పార్కింగ్ ఛార్జీలు గంటకు Dh25..!!
- GMU అలుమ్ని సమ్మిట్ 2026.. నాలుగు దేశాల్లో కొత్త అంతర్జాతీయ అలుమ్ని చాప్టర్ల ప్రారంభం
- దుబాయ్ షాపింగ్ ఫెస్టివల్ 2026.. డిసెంబర్ 4 నుంచి 45 రోజుల పాటు సందడే సందడి!







