ఖతార్‌లో ఆన్లైన్ అపాయింట్మెంట్ సదుపాయం..!!
- November 26, 2026
దోహా: ఖతార్ మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు కొత్త డిజిటల్ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై మంత్రిత్వ శాఖ అధికారులను నేరుగా కలిసేందుకు ప్రజలు ‘ఔన్’ (Oun) మొబైల్ యాప్ లేదా మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు.
ఈ సదుపాయం ద్వారా సంబంధిత విభాగాన్ని ఎంపిక చేసుకోవడంతో పాటు, తమకు అనుకూలమైన తేదీ, సమయాన్ని నిర్ణయించుకోవచ్చు. అధికారులతో చర్చించాల్సిన అంశాన్ని కూడా ముందుగానే నమోదు చేయవచ్చు. అపాయింట్మెంట్ బుక్ చేసుకున్న తర్వాత దాని వివరాలను ఆన్లైన్లో ట్రాక్ చేయవచ్చు. సమావేశం పూర్తయిన అనంతరం తమ అనుభవంపై అభిప్రాయాన్ని, రేటింగ్‌ను కూడా అందించే అవకాశం ఉంది.
అపాయింట్మెంట్ బుకింగ్ విధానం ఇలా..
* ముందుగా Oun యాప్ లేదా మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌ను తెరవాలి.
* ‘Book an Appointment with an Official’ ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాలి.
* సంబంధిత విభాగాన్ని ఎంచుకోవాలి.
* అనుకూలమైన తేదీ, అందుబాటులో ఉన్న సమయాన్ని ఎంపిక చేసుకోవాలి.
* సమావేశంలో చర్చించాల్సిన అంశాన్ని నమోదు చేసి అభ్యర్థనను సమర్పించాలి.
* అనంతరం అపాయింట్మెంట్ నిర్ధారణతో పాటు QR కోడ్ అందుతుంది.
ప్రజలకు ప్రభుత్వ అధికారులను సులభంగా కలిసే అవకాశం కల్పించడం, సంబంధిత విభాగాలతో సమాచార మార్పిడిని మెరుగుపరచడం ఈ కొత్త సేవ ప్రధాన ఉద్దేశమని మంత్రిత్వ శాఖ తెలిపింది. అలాగే సమావేశాల నిర్వహణలో పారదర్శకత, క్రమబద్ధత పెంచేందుకు ఈ విధానం దోహదపడనుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో ఆన్లైన్ అపాయింట్మెంట్ సదుపాయం..!!
- కువైట్‌లో వాహనదారుల అలెర్ట్.. సల్మియాలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- యూఏఈ వీరులకు భారత రక్షణ కార్యదర్శి ఘన నివాళులు
- యూఏఈలో గత 20 ఏళ్లలో జరిగిన మేజర్ యాక్సిడెంట్స్ ఇవే..!!
- వాట్సప్‌లో సరికొత్త ఫీచర్..ఇక మెసేజ్‌లు ఒక్కసారే చూడొచ్చు!
- బహ్రెయిన్‌లో చెత్త నిర్వహణ చట్టంలో మార్పులు..!!
- అరుణాచల్ సరిహద్దు పై భారత్-చైనా కీలక చర్చలు..10 రోజుల పాటు సమావేశాలు
- ఖతార్‌లో ఇండియన్ గ్రిల్ హౌస్ రెస్టారెంట్ మూసివేత..!!
- సౌదీలో 97 శాతానికి చేరిన ఆరోగ్య సేవల కవరేజీ..!!
- ఒమన్‌లో చూడదగ్గ పర్యాటక ప్రాంతాలు..!!







