సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌కు A+ రేటింగ్..!!

- November 26, 2026 , by Maagulf
సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్‌కు A+ రేటింగ్..!!

రియాద్: సౌదీ అరేబియా పబ్లిక్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (PIF) అంతర్జాతీయంగా మరో కీలక గుర్తింపు సాధించింది. ప్రముఖ క్రెడిట్ రేటింగ్ సంస్థ S&P గ్లోబల్ రేటింగ్స్ తొలిసారిగా PIFకు దీర్ఘకాలిక విదేశీ, స్థానిక కరెన్సీ క్రెడిట్ రేటింగ్‌గా A+ను కేటాయించింది. దీనికి స్థిరమైన అవుట్‌లుక్‌ (Stable Outlook) ప్రకటించింది. ఇప్పటికే ఉన్న స్వల్పకాలిక A-1 రేటింగ్‌లో ఎలాంటి మార్పు లేదని వెల్లడించింది. ఈ రేటింగ్స్ సౌదీ అరేబియా సార్వభౌమ రేటింగ్‌కు అనుగుణంగా ఉన్నాయి.

PIF దీర్ఘకాలిక వ్యూహం, బలమైన ఆర్థిక స్థితిపై అంతర్జాతీయంగా ఉన్న విశ్వాసానికి ఈ A+ రేటింగ్ నిదర్శనమని సంస్థ పేర్కొంది. దీనివల్ల ఫండ్‌కు స్థిరమైన నిధుల సమీకరణకు, దీర్ఘకాలిక పెట్టుబడి ప్రణాళికల అమలుకు మరింత మద్దతు లభించనుంది. నిధుల సమీకరణలో వైవిధ్యం, పరిమిత రుణభారం, 2026-2030 వ్యూహంలో భాగంగా పెట్టుబడుల విలువను పెంచడంపై దృష్టి వంటి అంశాలను S&P తన అంచనాలో పరిగణనలోకి తీసుకుంది. సౌదీ అరేబియా ఆర్థిక పరివర్తనలో PIF కీలక పాత్ర పోషిస్తున్న విషయాన్ని కూడా గుర్తించింది.

PIF క్యాపిటల్ ఫైనాన్స్ స్ట్రాటజీ విభాగం అధిపతి జియాద్ అల్‌ఫౌజాన్ మాట్లాడుతూ.. S&P నుంచి తొలిసారిగా A+ దీర్ఘకాలిక రేటింగ్ పొందడం సంస్థ క్రెడిట్ ప్రొఫైల్, దీర్ఘకాలిక నిధుల సమీకరణ ప్రణాళికలో ముఖ్యమైన మైలురాయని పేర్కొన్నారు. తమ ఆర్థిక స్థితి, పాలనా విధానం, స్థిరమైన నిధుల సమీకరణ సామర్థ్యంపై ఈ రేటింగ్ విశ్వాసాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపారు. ఇదిలా ఉండగా, మరో రెండు ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థలు కూడా PIFకు ఇప్పటికే ఉన్నత రేటింగ్స్‌ను కొనసాగించాయి. సెప్టెంబర్‌లో మూడీస్ తన Aa3 దీర్ఘకాలిక రేటింగ్‌ను స్థిరమైన అవుట్‌లుక్‌తో కొనసాగించగా, అక్టోబర్‌లో ఫిచ్ సంస్థ కూడా A+ దీర్ఘకాలిక రేటింగ్‌ను స్థిరమైన అవుట్‌లుక్‌తో ధ్రువీకరించింది.

మూడు అంతర్జాతీయ సంస్థల నుంచి PIFకు రేటింగ్స్..

* S&P: దీర్ఘకాలిక A+, స్వల్పకాలిక A-1 (స్థిరమైన అవుట్‌లుక్).
* Moody’s: దీర్ఘకాలిక Aa3, స్వల్పకాలిక P-1 (స్థిరమైన అవుట్‌లుక్).
* Fitch: దీర్ఘకాలిక A+, స్వల్పకాలిక F1+ (స్థిరమైన అవుట్‌లుక్).

ప్రపంచంలోనే ప్రభావవంతమైన పెట్టుబడి సంస్థల్లో ఒకటైన PIF, సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేయడం, దేశ ఆర్థిక పరివర్తనను వేగవంతం చేయడం, దీర్ఘకాలికంగా స్థిరమైన ఆర్థిక రాబడులను సాధించడం లక్ష్యంగా పెట్టుబడులు కొనసాగిస్తోందని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com