బహ్రెయిన్‌లో భారీ డ్రగ్స్ ముఠాకు శిక్షలు.. జీవిత ఖైదు..!!
- November 26, 2026
మనామా: భారీ స్థాయిలో మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు పాల్పడిన ముగ్గురు నిందితులకు బహ్రెయిన్ కోర్టు కఠిన శిక్షలు విధించింది. 114 కిలోగ్రాములకు పైగా గంజాయి, ఇతర మాదకద్రవ్యాలను అక్రమంగా దేశంలోకి తీసుకొచ్చి విక్రయించేందుకు ప్రయత్నించిన కేసులో ఇద్దరికి జీవిత ఖైదు విధించగా, మరో వ్యక్తికి 10 ఏళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది.
బహ్రెయిన్ డ్రగ్స్ క్రైమ్స్ ప్రాసిక్యూషన్ చీఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశంలోకి సముద్ర మార్గం ద్వారా మాదకద్రవ్యాలను అక్రమంగా తరలిస్తున్న అంతర్జాతీయ ముఠాపై నార్కోటిక్స్ విభాగానికి సమాచారం అందింది. విదేశాల్లోని నెట్‌వర్క్‌లతో సంబంధాలు కలిగిన ఈ ముఠా, ప్రధానంగా ఆసియా దేశాలకు చెందిన వ్యక్తుల సహకారంతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు.
ఈ క్రమంలో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 114 కిలోగ్రాములకు పైగా హషీష్, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం ముగ్గురిపై నేరాలు నిరూపణ కావడంతో హై క్రిమినల్ కోర్టు తీర్పు వెల్లడించింది. మొదటి ఇద్దరు నిందితులకు జీవిత ఖైదుతో పాటు ఒక్కొక్కరికి BD10,000 జరిమానా విధించింది. మూడో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష, BD5,000 జరిమానా విధించింది. శిక్ష పూర్తయిన తర్వాత అతడిని శాశ్వతంగా దేశం నుంచి బహిష్కరించాలని ఆదేశించింది.
స్వాధీనం చేసుకున్న మాదకద్రవ్యాలను కూడా జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో బహ్రెయిన్ పబ్లిక్ ప్రాసిక్యూషన్ అధికారులు సంఘటనా స్థలాన్ని పరిశీలించడంతో పాటు నిందితులను విచారించి, స్వాధీనం చేసుకున్న డ్రగ్స్, ఇతర ఆధారాలను వారి ముందు ఉంచారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం కేసును కోర్టుకు పంపించారు.
తాజా వార్తలు
- కువైట్‌లో బ్యాచిలర్ నివాసాలపై చర్యలు..!!
- ఒమన్‌లో డ్రోన్ పోటీ..RO 10,000 బహుమతులు..!!
- బహ్రెయిన్‌లో భారీ డ్రగ్స్ ముఠాకు శిక్షలు.. జీవిత ఖైదు..!!
- సౌదీ పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్‌కు A+ రేటింగ్..!!
- దుబాయ్ అల్ మక్తూమ్ ఎయిర్పోర్ట్ విస్తరణకు భారీ ముందడుగు..!!
- ఖతార్‌లో ఆన్లైన్ అపాయింట్మెంట్ సదుపాయం..!!
- కువైట్‌లో వాహనదారుల అలెర్ట్.. సల్మియాలో ట్రాఫిక్ ఆంక్షలు..!!
- యూఏఈ వీరులకు భారత రక్షణ కార్యదర్శి ఘన నివాళులు
- యూఏఈలో గత 20 ఏళ్లలో జరిగిన మేజర్ యాక్సిడెంట్స్ ఇవే..!!
- వాట్సప్‌లో సరికొత్త ఫీచర్..ఇక మెసేజ్‌లు ఒక్కసారే చూడొచ్చు!







