ఇరాన్ డ్రోన్ దాడిలో గాయపడ్డ ఇద్దరు ఇటలీ పౌరులు మృతి..!!

- November 27, 2026 , by Maagulf
ఇరాన్ డ్రోన్ దాడిలో గాయపడ్డ ఇద్దరు ఇటలీ పౌరులు మృతి..!!

కువైట్: కువైట్‌లోని కీలక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన ఇరాన్ డ్రోన్ దాడిలో గాయపడిన ఇద్దరు ఇటలీ పౌరులు చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ విషయాన్ని కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. రక్షణ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి స్టాఫ్ కల్నల్ సౌద్ అల్ అత్వాన్ ఈ మరణాలను ధ్రువీకరించారు. 

ఇరాన్ దాడిలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఇటలీ పౌరులు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఈ ఘటనలో ఇంకా గాయాలతో చికిత్స పొందుతున్న వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది.

అంతకుముందు కువైట్ గగనతలంలోకి ప్రవేశించిన డ్రోన్లు దేశంలోని ఓ కీలక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో డ్రోన్ల నుంచి పడిన శకలాల కారణంగా నలుగురు గాయపడ్డారు. వీరిలో ఒక కువైట్ పౌరుడు, ఇద్దరు ఇటలీ పౌరులు, ఒక పాకిస్థానీ ఉన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com