విమానంలో సాంకేతిక లోపం.. మస్కట్‌కు మళ్లింపు..!!

- November 28, 2026 , by Maagulf
విమానంలో సాంకేతిక లోపం.. మస్కట్‌కు మళ్లింపు..!!

మస్కట్: విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో దుబాయ్ నుంచి హాంకాంగ్ వెళ్తున్న ఎమిరేట్స్ స్కైకార్గో విమానాన్ని మస్కట్‌కు మళ్లించారు. 

దుబాయ్‌లోని అల్ మక్తూమ్ అంతర్జాతీయ విమానాశ్రయం (DWC) నుంచి హాంకాంగ్ (HKG)కు బయలుదేరిన ఎమిరేట్స్ స్కైకార్గోకు చెందిన EK9774 విమానంలో సాంకేతిక సమస్య గుర్తించారు. దీంతో ముందస్తు జాగ్రత్త చర్యగా విమానాన్ని ఒమన్ రాజధాని మస్కట్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి (MCT) మళ్లించారు.

విమానం మస్కట్ విమానాశ్రయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ల్యాండ్ అయింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం విమాన సిబ్బంది కూడా క్షేమంగా కిందకు దిగారు. సాంకేతిక నిపుణులు విమానాన్ని తనిఖీ చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com