సౌదీ, టర్కీ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు..!!
- November 28, 2026
రియాద్: సైనిక, రక్షణ రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడంపై సౌదీ అరేబియా, టర్కీ రక్షణ మంత్రులు చర్చించారు. ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాలతో పాటు ప్రాంతీయ భద్రత, స్థిరత్వాన్ని పెంపొందించేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఇస్లామాబాద్‌లో జరిగిన మక్కా అలయన్స్ ఫర్ డిఫెన్స్‌కు చెందిన పొలిటికల్ అండ్ డిఫెన్స్ స్ట్రాటజీ కమిటీ రెండో సమావేశం సందర్భంగా సౌదీ రక్షణ మంత్రి ప్రిన్స్ ఖాలిద్ బిన్ సల్మాన్, టర్కీ జాతీయ రక్షణ మంత్రి యాషర్ గులెర్‌తో సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో సైనిక, రక్షణ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించాలని నిర్ణయించారు. ఈ భాగస్వామ్యం ఇరు దేశాల ప్రయోజనాలకు, ప్రాంతీయ భద్రతకు దోహదపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశానికి సౌదీ విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్, సైనిక దళాల చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్, జాయింట్ ఫోర్సెస్ తాత్కాలిక కమాండర్ జనరల్ ఫయ్యాద్ అల్ రువైలీ, రక్షణ మంత్రి ఇంటెలిజెన్స్ వ్యవహారాల సలహాదారు హిషామ్ బిన్ సైఫ్ హాజరయ్యారు.
తాజా వార్తలు
- ధోఫర్ గవర్నరేట్‌లో అత్యవసర వైద్య తరలింపు ఆపరేషన్..!!
- సౌదీ, టర్కీ రక్షణ మంత్రుల మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో డ్రగ్స్ అక్రమ రవాణా.. వ్యక్తికి జీవిత ఖైదు..!!
- సముద్ర మార్గాల భద్రత దేశాల ఆర్థిక శ్రేయస్సుకు కీలకం: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
- భవన్స్ పబ్లిక్ స్కూల్ నూతన భవనాన్ని ప్రారంభించిన భారత రాయబారి డాక్టర్ శ్రీకర్ రెడ్డి
- పేద మహిళలను అక్రమంగా గల్ఫ్‌కు తరలిస్తున్నారనే ఆరోపణలు..భారత్ ట్రావెల్స్ యజమాని అరెస్ట్
- కామారెడ్డి జిల్లాలో నేరాల నియంత్రణ పై తెలంగాణ డీజీపీ సమీక్ష..
- కువైట్‌లో మాదకద్రవ్యాల కేసులో రాజకుటుంబ సభ్యుడి అరెస్ట్..
- దుబాయ్ ఇంటర్నేషనల్ బోట్ షో 2026ను సందర్శించిన షేక్ మహమ్మద్
- బహ్రెయిన్‌లో సిత్రా మురుగునీటి శుద్ధి కేంద్రం విస్తరణ..!!







