అబూధాబీ టవర్లలో అగ్నిప్రమాదం 13 మంది ఊపిరందక సతమతం

- August 30, 2016 , by Maagulf
అబూధాబీ  టవర్లలో అగ్నిప్రమాదం 13 మంది ఊపిరందక సతమతం

అబూధాబీ :  స్థానిక జాహితా  ప్రాంతంలో మంగళవారం రెండు  నిర్మాణంలో ఉన్న భవనాలలో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పదమూడు మంది, మరో పది మంది అగ్నిమాపక దళ సభ్యులు ఊపిరి అంధక స్వల్పంగా అస్వస్థతకు లోనయ్యారు..    

అబూధాబీ సివిల్ డిఫెన్స్ డైరక్టర్ జనరల్ లెఫ్టినెంట్ కల్నల్ మొహమ్మద్ అల్ అన్సారీ, మాట్లాడుతూ  కార్యకలాపాలు గది వద్దకు  10:50 గంటలకు అగ్నిప్రమాదం గూర్చి సమాచారం అందుకొన్నామని  నివేదిక అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి వెంటనే  ఫైర్ ఇంజన్లు పంపినట్లు ఆయన తెలిపారు. ముఖ్యులైన    ఇంటర్వెన్షన్ యూనిట్ నుండి ఒక ఉమ్మడి బృందం రెండు టవర్లలో  చిక్కుకున్నపలువుర్ని  ముందస్తు జాగ్రత్తగా సమీపంలోని నివాస భవనాలలో నుంచి  వారినీ  రక్షించి  ఎమిరేట్స్ రెడ్ క్రెసెంట్ అందించిన తాత్కాలిక ఆశ్రయంలో వారినీ ఉంచారని ఆయన తెలిపారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల  ప్రకారం, సిటీ టెర్మినల్ పక్కన ఒక అబూ ధాబీ మాల్ సమీపంలో నిర్మాణంలో ఉన్న 27 అంతస్థుల భవనంలో  మంగళవారం ఉదయం  11 గంటల సమయంలో అగ్ని రాజుకొని మంటలు వేగంగా వ్యాపించాయి. ఆరేడు ఫైర్ ఇంజన్లు మంటలను ఆర్పేందుకు రంగంలోనికి దిగేయి. మరి కొన్ని వాహనాలు  మార్గం మధ్యలో  ఉన్నాయి. ఎయిర్ కండిషనింగ్ మెషిన్ లో ఏర్పడిన తప్పు కారణంగా అగ్ని ప్రామాదం జరగడానికి కారణం అయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.ఈ అగ్ని ప్రమాదం  నిర్మాణ ప్రాంతంలో 600 మంది  కార్మికులు ఉండగా జరిగినట్లు  ఒక కార్మికుడు తెలిపాడు.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com