అభ్యంతరకర వీడియో: విద్యార్థుల అరెస్ట్‌

- August 31, 2016 , by Maagulf
అభ్యంతరకర వీడియో: విద్యార్థుల అరెస్ట్‌

అభ్యంతరకర వీడియో కేసులో ముగ్గురు విద్యార్థుల్ని మస్కట్‌ గవర్నరేట్‌ పరిధిలోని ఓ ప్రైవేటు స్కూల్‌ నుంచి అదుపులోకి తీసుకున్నారు. సోషల్‌ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇద్దరు టీనేజ్‌ కుర్రాలు ఇందులో, అభ్యంతరకరంగా నటించారు. వీడియోని మరో కుర్రాడు చిత్రీకరించాడు. పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌ విచారణలో ఉందిప్పుడు ఈ కేసు. గత ఏప్రిల్‌లో మస్కట్‌ ప్రైమరీ కోర్ట్‌, ముగ్గురు యువకులకు ఇలాంటి కేసులోనే ఏడాదిపాటు జైలు శిక్ష విధించింది. అలాగే 1000 రియాల్స్‌ ఫైన్‌ కూడా విధించడం జరిగింది. గత ఏడాది నవంబర్‌లో, ఓ ఒమనీ వ్యక్తి తన గర్ల్‌ఫ్రెండ్‌ ఫొటోల్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పొందుపర్చినందుకుగాను నెల రోజుల జైలు, 2000 రియాల్స్‌ ఫైన్‌ ఎదుర్కొన్నాడు. అందులో సగం బాధితురాలైన యువతికి కాంపన్సెషన్‌ కింద ఇవ్వడం జరిగింది. ఒమన్‌ సైబర్‌ చట్టం, ఆర్టికల్‌ 16 ప్రకారం ఇతరుల ప్రైవేటు లైఫ్‌కి సంబంధించిన ఫొటోలు లేదా వీడియోల్ని తీసి, ప్రచారంలోకి తెస్తే జైలు శిక్షతోపాటు, భారీ జరీమానా తప్పదు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com