సమ్మర్‌ ఫెస్టివల్‌: 140,000 మంది సందర్శన

- August 31, 2016 , by Maagulf
సమ్మర్‌ ఫెస్టివల్‌: 140,000 మంది సందర్శన

140,000 మందికి పైగా సందర్శకులు నెల రోజులపాటు జరిగిన ఖతార్‌ సమ్మర్‌ ఫెస్టివల్‌ (క్యుఎస్‌ఎఫ్‌) లో సందడి చేశారు. ఖతార్‌ టూరిజం అథారిటీ ఈ వివరాల్ని వెల్లడించింది. రెసిడెంట్స్‌, విజిటర్స్‌ ఈ సందర్భంగా టెంపరరీ ఫేర్‌వెల్‌ని ఈ ఫెస్టివల్‌ సీజన్‌కి అందించారు. భారీ ఫైర్‌ వర్క్స్‌తో ముగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి ఏడాదీ జరిగే ఈ సెలబ్రేషన్‌, సందర్శకుల్ని ప్రతిసారీ మరింత కొత్తగా కట్టిపడేస్తూనే ఉంది. ఆఖరి వీకెండ్‌లో చైల్డ్‌ సింగర్‌ రమా రబాత్‌ ప్రదర్శన ఆకట్టుకుంది. స్థానిక కామెడీ టాలెంట్‌ ప్రోగ్రామ్‌లో 4000 మంది సందడి చేశారు. 60 మంది లక్కీ విన్నర్స్‌ నాలుగు జాగ్వార్‌ కార్లు, అలాగే 800,000 ఖతారీ రియాల్స్‌ విలువైన బహుమతుల్ని ఈ ఫెస్టివల్‌లో గెలుచుకున్నారు. హాస్పిటాలిటీ సెక్టార్‌ ఈ ఫెస్టివల్‌ ద్వారా గత ఏడాదితో పోల్చితే రెట్టింపు సందర్శకులకు స్పెషల్‌ ప్యాకేజీలను అందించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com