'నీరాజనం' పాటలు విడుదల
- September 01, 2016
మగేష్, సభ్యసాచి, కారుణ్య, సన షాలిని నాయకానాయికలుగా నటిస్తున్న చిత్రం నీరాజనం. అవన్ ఆళ్ల దర్శకుడు. మహాలక్ష్మీ మూవీస్ పతాకంపై తెలుగు, తమిళ, ఒరియా భాషల్లో ఈ చిత్రాన్ని దాడి అప్పలనాయుడు నిర్మిస్తున్నారు. ఈ చిత్ర గీతాలు బుధవారం రాత్రి హైదరాబాద్‌లో విడుదలయ్యాయి. ఈ చిత్ర ట్రైలర్‌ను దర్శకుడు వి.సాగర్ విడుదల చేయగా రవిశంకర్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో బిగ్ సీడీని నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. ఆడియో సీడీని మల్కాపురం శివకుమార్ ఆవిష్కరించించారు.
ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ నీరాజనం మంచి టైటిల్.
మంచి ప్లానింగ్‌తో మూడు భాషల్లో నిర్మించిన ఈ సినిమా నిర్మాత పెట్టిన ప్రతి పైసా తిరిగిరావాలి. రవిశంకర్ అందించిన పాటలు అద్భుతంగా వున్నాయి. సభ్యసాచి ఓరియాలో స్టార్ హీరో, షాపింగ్‌మాల్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన మగేష్..ఈ ఇద్దరూ కలిసి నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించాలి అన్నారు. దర్శకుడు అవన్ ఆళ్ల మాట్లాడుతూ ఓ మ్యూజికల్ రియాలిటీ షో నేపథ్యంలో సాగే ముక్కోణ ప్రేమకథా చిత్రమిది.
మూడేళ్ల క్రితం చేసుకున్న కథ ఇది. ఏడాది క్రితం నిర్మాతకు చెప్పాను. నాపై నమ్మకంతో కథ వినకుండానే ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారు. నేటి ట్రెండ్‌కు అనుగుణంగా సాగుతుంది అన్నారు. నిర్మాత దాడి అప్పలనాయుడు మాట్లాడుతూ దర్శకుడిపై వున్న నమ్మకంతో తెలుగు, తమిళ, ఒరియా భాషల్లో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. నిర్మాతగా ఇది నా తొలి సినిమా. చాలా కథలు విన్నాను.
అయితే అనుకున్న కథను సమర్థవంతంగా తెరకెక్కించగలిగే దర్శకుడైతే బాగుంటుందని అవన్ ఆళ్లను దర్శకుడిగా పరిచయం చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు రవిశంకర్, మగేష్, సభ్యసాచి, కారుణ్య, సన షాలిని, బన్నీ ప్రకాష్, కెమెరామెన్ మహీశేర్ల, పి.తిలక్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







