పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు జన్మదిన శుభాకాంక్షలు
- September 01, 2016
"పవర్ స్టార్" పవన్ కళ్యాణ్ , అన్న చాటు తమ్ముడుగా కెరీర్ మొదలు పెట్టి , అన్న కన్నా మిన్నగా ఎదిగటం సామాన్యమైన విషయం కాదు. అటు సినిమా రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా అతనిది ఒక విలక్షనమైన శైలి.అతనిని ప్రజలకు దగ్గర చేసింది, అతని నటన ఒక్కటే కాదు, నిజానికి నటుడిగా పవన్ కళ్యాణ్ ఇంతవరకు నిరూపించుకోలేదు కూడా, అయన కెరీర్ మొదటినుండి కూడా అతను స్టార్ కావటం వల్ల నటుడిగా ప్రూవ్ చేసుకొనే అవకాశం రాలేదేమో. ఇరవై సంవత్సరాల కెరీర్ లో పది సంవత్సరాలు ప్లాప్స్ మాత్రమే పలకరించినా అతని ఇమేజ్ ఏ మాత్రం తగ్గలేదు అంటే అర్ధం చేసుకోవచ్చు, అతని లో ఉన్న స్టార్ ఇమేజ్ ఎంత శక్తివంతమైనదో తెలుసుకోవాలంటే . అతనిలో ఉన్న ఆవేశం ప్రజలకు అతన్ని దగ్గర చేసింది, సాధారణ ప్రజలకు ఉండే సహజ ఆవేశం అతనిలోనూ కనిపిస్తుంది. సాధారణ ప్రజలు ఆలోచించే ఆలోచనలే అతనిలోనూ కనిపిస్తుంటాయి, సరిగ్గా ఈ లక్షణాలే అతనికి స్టార్ ఇమేజ్ కన్నా ఎక్కువ ఇమేజ్ ని తీసుకువచ్చాయి.
ఇప్పుడు పవన్ కళ్యాణ్ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం, ఇప్పటివరకు హీరోగా ప్రజల మనిషిగా అందరి మన్ననలు పొందిన అతన్ని ఇప్పుడు ఒక వర్గం తమ వాడిగా మాత్రమే చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఇలాంటి వాటిని పవన్ కళ్యాణ్ మొదట్లొనే తుంచేయాలి, అయన ఇమేజ్ ని మిస్ యూజ్ చేసుకొనే అవకాశాలను ఎవ్వరికీ ఇవ్వకూడదు. ఇది జరగాలంటే అతను ప్రజలతో నిత్యం ఉండాలి. ఇలా కాకపోతే ఇప్పటివరకు చేసిందంతా వృధా అయ్యి పవన్ కళ్యాణ్ అందరివాడు కాకుండా కేవలం కొండరివాడులా మిగిలిపోతాడు.
Happy Birthday To Pawan Kalyan.....వాసుదేవ రావు (మా గల్ఫ్ జర్నలిస్ట్)💐💐💐💐
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ: లక్కీ డే డ్రాలో 4,034 మందికి బహుమతులు..!!
- ట్యాంకర్ నుండి ప్రమాదకర పదార్థాలు లీకేజీ..డ్రైవర్ మృతి..!!
- హవల్లీలో ఫుడ్ కోర్ట్ మూసివేసిన ఫుడ్ అథారిటీ..!!
- హోర్ముజ్ జలసంధిలో భారత నౌకల పై దాడి..
- గ్లోబల్ విలేజ్ మళ్లీ సందర్శకులకు స్వాగతం పలకనుంది
- IPL 2026: చెన్నై పై హైదరాబాద్ విజయం
- ‘రన్ ఫర్ ది నేషన్’లో 25 వేల మంది పాల్గొనడంతో ఐక్యతకు ప్రతీక
- స్పైస్‌జెట్‌లో భారీ లేఆఫ్స్…500 మందికి షాక్
- హోర్ముజ్, లెబనాన్ సీజ్ ఫైర్ పై అమెరికా, సౌదీ చర్చలు..!!
- ఇరాన్ ఎయిర్ స్పేస్ పాక్షికంగా రీ ఓపెన్..!!









