కజికిస్తాన్ లో మెడికల్ విద్యార్థులకు చేదు అనుభవం
- September 01, 2016
కజికిస్తాన్ లో ఎంబీబీఎస్ చేస్తున్న తెలుగు విద్యార్థులకు చేదు అనుభవం ఎదురైంది. కజికిస్తాన్ లో ఎంబీబీఎస్ చేస్తూ మొదటి సంవత్సరం పూర్తి చేసుకొని సెలవులకు ఇంటికి వచ్చిన తెలుగు విద్యార్థులు గురువారం తిరుగు పయనం అయ్యారు. అయితే వారిని యూనివర్శిటీ హాస్టళ్లోకి సిబ్బంది అనుమతించ లేదు. అడ్మిషన్ టైంలో కన్సల్టెన్సీ చెప్పిన ఫీజుకంటే రెట్టింపు చెల్లిస్తేనే లోపలికి అనుమతి అంటూ రాత్రి సమయం అని కూడా చూడకుండా యాజమాన్యం హాస్టల్ రూమ్ లకు తాళాలు వేసింది.
వర్షం కూడా కురవడంతో యూనివర్శిటీ బయటే చలిలో తెలుగు విద్యార్థులు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఉదయం వరకైనా అనుమతి ఇవ్వాలని కోరినా, ఒప్పుకోకుండా దుర్భాషలాడారంటూ విద్యార్థులు(అబ్బాయిలు,అమ్మాయిలు) తమ తల్లిదండ్రులకు వాట్సాప్ లో గోడువెల్లబోసుకున్నారు.
పిల్లల మెసెజ్ లతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు, కజికిస్తాన్ లో ఎంబీబీఎస్ లో చేర్పించిన ఎన్ఈఓ కన్సల్టెన్సీని సంప్రదించారు. అయితే వారు కూడా పట్టించుకోవటంలేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు.
200 మంది తెలుగు విద్యార్థులు ఎన్ఈఓ కన్సల్టేన్సీ ద్వారా గత ఏడాది కజకిస్తాన్ లో ఎంబీబీఎస్ లో చేరారు. ఇటీవల సెలవులపై ఇంటికి వచ్చి దాదాపు 50 మంది తెలుగు విద్యార్థులు హైదరాబాద్ నుంచి కజకిస్తాన్ కు తిరిగి వెళ్లారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







