ఆఫర్ల కోసం 'లైక్‌'లను టచ్‌ చేయొద్దు

- September 01, 2016 , by Maagulf
ఆఫర్ల కోసం 'లైక్‌'లను టచ్‌ చేయొద్దు

సోషల్‌ మీడియాలో లైక్‌లు షేర్‌లు చేయడమంటే మీకిష్టమా? మంచి మంచి ఆఫర్లు కన్పిస్తున్నాయని సోషల్‌ మీడియాలో చెలరేగిపోతున్నారా? అయితే మీ కోసమ ఈ హెచ్చరిక. ఎమిరేట్స్‌, ఫ్లై ఎమిరేట్స్‌ లోగోతో కూడిన కొన్ని ఆఫర్లు ఈ మధ్య సోషల్‌ మీడియాలో కనిపిస్తున్నాయి. లైక్స్‌, షేర్స్‌ చేయడం ద్వారా ఏడాది అంతటా ఎమిరేట్స్‌ విమానాల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు స్కామర్లు ఉత్తుత్తి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఈ ఆఫర్‌కి 32,000 మంది లైక్‌లు, షేర్‌లు ఇచ్చేశారు. ఈ ప్రచారంపై ఎమిరేట్స్‌ సంస్థని సంప్రదించినప్పుడు ఎమిరేట్స్‌ వర్గాలు పూర్తిగా ఇదంతా అవాస్తమవని పేర్కొన్నాయి. ప్రత్యేకంగా తమకున్న అధికారిక సోషల్‌ మీడియా ఛానల్స్‌ ద్వారా మాత్రమే తమ ఆఫర్లను ప్రకటిస్తామని ఎమిరేట్స్‌ అధికారులు చెప్పారు. గతంలో ఇలాంటి సంఘటన వెలుగు చూసినప్పుడు స్కామర్స్‌పై లీగల్‌ చర్యలకు ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. ఎవరూ అలాంటి స్కామర్స్‌ని విశ్వసించరాదని ఎమిరేట్స్‌ వర్గాలు వినియోగదారుల్ని కోరాయి. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com