మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ రోడ్‌పై మరో మూడు లేన్ల ప్రారంభం

- September 02, 2016 , by Maagulf
మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ రోడ్‌పై మరో మూడు లేన్ల ప్రారంభం

షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ రోడ్‌పై మూడు కొత్త లేన్లను నేడు ప్రారంభమవుతున్నాయి. ఈ ప్రారంభంతో అల్‌ యాలాయిస్‌ రోడ్‌ జంక్షన్‌ నుంచి జెబెల్‌ అలి లిహెబాబ్‌ రౌండెబౌట్‌ నుంచి అబుదాబీ వైపు మొత్తం ఆరు లేన్లు అందుబాటులోకి వస్తాయి. రోడ్స్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ (ఆర్‌టిఎ), షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ రోడ్‌ వైడెనింగ్‌ ప్రాజెక్టులో భాగంగా ఈ విస్తరణను చేపట్టింది. ఈ తాజా ప్రారంభంతో రోడ్డుపై ట్రాఫిక్‌ మరింత స్మూత్‌గా ఉంటుందని ఆర్‌టిఎ ట్రాఫిక్‌ అండ్‌ రోడ్స్‌ ఏజెన్సీ డైరెక్టర్‌ నబీల్‌ సలియా చెప్పారు. గత ఫిబ్రవరిలో ఆర్‌టిఎ మూడు లేన్లను ఈ రోడ్డు వైడెనింగ్‌ ప్రాజెక్ట్‌లో ప్రారంభించింది. సుమారు 7 కిలోమీటర్ల మేర ఈ లేన్లను ప్రారంభించారు. షేక్‌ బిన్‌ జాయెద్‌ రోడ్‌ని అతి ప్రమాదకరమైన రోడ్డుగా గతంలో పోలీసులు నిర్ధారించి, రోడ్డు విస్తరణ పనుల్ని చేపట్టారు. 14 అతి తీవ్రమైన ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ప్రమాదాల జాబితాలో ఎమిరేఓట్స్‌ రోడ్డు 9 ప్రమాదాలతో రెండో స్థానంలో నిలిచింది. వాహనాల మధ్య సరైన దూరం పాటించడం, అలాగే ఉన్నపళంగా వాహనాల వేగాన్ని తగ్గించడం లేదా టర్నింగ్స్‌ తీసుకోవడం వంటివి ప్రమాదాలకు కారణాలుగా అధికారులు చెబుతున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com