'బుక్‌డ్' ట్యాక్సీలతో జాగ్రత్త
- September 03, 2016
దుబాయ్ స్ట్రీట్స్‌లో ట్యాక్సీ కోసం ప్రయత్నించేముందు అది 'బుక్‌డ్' ట్యాక్సీనా? కాదా? అనే విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఒక్కోసారి బుక్ చేసుకున్న ట్యాక్సీ చివరి నిమిషంలో రద్దు కావడం, అదే ట్యాక్సీ బుక్‌డ్ ట్యాక్సీతో మీ ముందుకు రావొచ్చు. మామూలుగా అయితే 5 దిర్హామ్‌లతో ట్యాక్సీ ఫేర్ ప్రారంభమవుతుంది. అయితే, బుక్‌డ్ ట్యాక్సీలు మాత్రం 8 దిర్హామ్‌ల నుంచి ప్రారంభమవుతాయి. చాలామంది బుక్ చేసుకున్న ట్యాక్సీ వచ్చే వరకూ వేచి చూసే పరిస్థితులు ఉండవనీ, అలాంటి పరిస్థితుల్లో ట&వఆయక్సీ డ్రైవర్ ఆర్‌టిఎ ఓసిసి (కాల్ సెంటర్)ని సంద్రబీపించి, బుకింగ్‌ని క్యాన్సిల్ చేసుకోవాల్సి ఉంటుందని పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ - రోడ్స్ అండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ సిఇఓ అబ్దుల్లా యూసుఫ్ చెప్పారు. ఇంకో వైపున వినియోగదారుల అభిప్రాయాలు మరోలా ఉన్నాయి. ట్యాక్సీ కోసం ఎదురుచూస్తున్న సమయంలో తన వద్దకు వచ్చిన ఓ ట్యాక్సీని స్ట్రీట్ పికప్ ట్యాక్సీగా చెప్పుకున్నారనీ, మినిమమ్ ఛార్జీగా 8 దిర్హామ్‌లు వసూలు చేశారని వాపోయారు ఓ వినియోగదారుడు. అయితే ఆర్‌టిఎ నుంచి వచ్చిన మెసేజ్‌ల ప్రకారం తాము నడుచుకుంటామనీ లేదంటే తమ లైసెన్సులు రద్దవుతాయని ట్యాక్సీ డ్రైవర్లు చెబుతున్నారు. అయితే మామూలు టాక్సీల ఛార్జీల్లో ఎలాంటి మార్పులు లేవని, అలాగే బుక్‌డ్ ట్యాక్సీలకు నిర్ధారిత ధరలే వర్తిస్యాని ఆర్‌టిఎ వర్గాలు స్పష్టం చేశాయి. అందుకే ట్యాక్సీని వినియోగించాలనుకున్నప్పుడు అది బుక్‌డ్ ట్యాక్సీనా? లేదా? అనేది క్షుణ్ణంగా గమనించాలి.
తాజా వార్తలు
- విశాఖపట్నంలో ఈ నెల 14, 15 తేదీల్లో సీఐఐ సదస్సు ...
- ఇస్లామాబాద్: కారులో ఉంచిన సిలిండర్ పేలి 12 మంది మృతి..
- అంతర్జాతీయ సరిహద్దులు మూసివేత
- ఢిల్లీ పేలుడు ఘటనపై ఎన్ఐఏకి అప్పగించిన కేంద్రం
- ట్రాఫిక్ అలెర్ట్.. 4రోజులపాటు అల్ ఖోర్ కార్నిష్ క్లోజ్..!!
- సౌదీ అరేబియా, కువైట్ మధ్య 4 అవగాహన ఒప్పందాలు..!!
- దుబాయ్లో ముగ్గురు పిల్లల తండ్రి మిస్సింగ్..సాయం కోసం వేడుకోలు..!!
- కువైట్ మంత్రిని కలిసిన పరమిత త్రిపాఠి..!!
- ఒమన్ లో మంకీపాక్స్ పై హెల్త్ అడ్వైజరీ జారీ..!!
- బహ్రెయిన్-ఖతార్ ఫెర్రీ సర్వీస్.. స్వాగతించిన క్యాబినెట్..!!







