చిరంజీవి ముఖ్య అతిధిగా నాని మజ్ను ఆడియో వేడుక
- September 04, 2016
మెగా స్టార్ చిరంజీవి ఏ సినీ నేపద్యం లేకుండా హీరోగా.. స్టార్ హీరోగా తెలుగు సినీ ఇండస్ట్రీ లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకొన్నాడు.. ఎంతో మంది హీరోలు చిరంజీవి ని ఇన్ స్పిరేషన్ గా తీసుకొని ఇండస్ట్రీలో అడుగు పెట్టారు.. పెడుతున్నారు.. యంగ్ హీరో నాని కూడా సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగు పెట్టి.. హీరోగా మారి తనకంటూ ఓ ఇమేజ్ ను సొంతం చేసుకొన్నాడు.. ఈ నేచ్యురల్ స్టార్ నాని కెరీర్ వరస హిట్స్ తో మంచి పీక్ స్టేజ్ లో ఉన్నది.. జెంటిల్ మెన్ వంటి హిట్ సినిమా తర్వాత నాని చేస్తోన్న సినిమా మజ్ను.. ఈ సినిమా ఆడియో వేడుక ఈ రోజు జరుపుకొనున్నది.. ఈ ఆడియో వేడుకను జెమిని ఛానల్ వారు ప్రసారం చేయనున్నారు. కాగా జెమిని కిరణ్ స్పెషల్ రిక్వెస్ట్ పై చిరంజీవి ఈ సినిమాకు ముఖ్య అతిధిగా హాజరు కానున్నారు. ఉయ్యాల జంపాల సినిమాతో దర్శకుడిగా పరిచయమైన విరించి వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు.. నాని సరసన ఆన్‌ను ఇమ్మాన్యూల్, ప్రియా శ్రీ లు హీరోయిన్లు గా నటిస్తున్నారు.. సెప్టెంబర్ 16 న ప్రేక్షకుల ముందు రానున్నది.
తాజా వార్తలు
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..
- హైదరాబాద్ హీరోస్‌కు రగ్బీ ప్రీమియర్ లీగ్ టైటిల్..విజేతలకు ట్రోఫీ అందించిన సీఎం రేవంత్
- ఫ్రాన్స్‌లో రెండు రోజుల అధికారిక పర్యటనకు ఒమాన్ సుల్తాన్ హైథమ్ బిన్ తారిక్ చేరిక
- AIతో పార్కు డిజైన్ చేస్తే Dh200,000 బహుమతి..
- జూలైలో బ్యాంక్ కి 12 రోజులు సెలవులు
- ప్రభుత్వ లాంఛనాలతో భాగ్య రాజ్ అంత్యక్రియలు పూర్తి
- సౌదీ అరామ్కో హెలికాప్టర్ కుప్పకూలి 14 మంది దుర్మరణం!
- మెటాకు గూగుల్ బిగ్ షాక్..
- ఒమన్‌లో అవినీతి పై కఠినమైన నిబంధనలు..!!







