రామ్‌గోపాల్ వర్మ చేతులమీదుగా 'సిద్దార్థ' పాటలు

- September 04, 2016 , by Maagulf
రామ్‌గోపాల్ వర్మ చేతులమీదుగా 'సిద్దార్థ' పాటలు

''సిద్ధార్థ పేరుతో నాకు స్ట్రాంగ్ ఎమోషనల్ కనెక్షన్ ఉంది. నేను గూండాలు, రౌడీలు, హింస గురించి నేర్చుకున్నది విజయవాడ సిద్ధార్థ కాలేజీలోనే. అక్కడ నేర్చుకున్న రౌడీయిజం నుంచే దాసరి కిరణ్ నిర్మాతగా 'వంగవీటి' తీస్తున్నాను. బహుశా.. ఈ కనెక్షన్ మా నిర్మాత కూడా ఆలోచించి ఉండరు'' అని ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అన్నారు. సాగర్ హీరోగా కేవీ దయానంద్ దర్శకత్వంలో దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న సినిమా 'సిద్ధార్థ'. రాగిణీ నంద్వాణి, సాక్షీ చౌదరి హీరోయిన్లు. మణిశర్మ స్వరపరిచిన ఈ చిత్రం పాటలను రామ్‌గోపాల్ వర్మ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ - ''సాగర్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది.

 

కమర్షియల్ అంశాలన్నీ ఉన్న ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను'' అన్నారు. నిర్మాత దాసరి కిరణ్‌కుమార్ మాట్లాడుతూ - ''మొగలిరేకులు' సీరియల్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంటికి తెలిసిన సాగర్ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్టు దయానంద్ మంచి సినిమా తీశారు. గోపాల్‌రెడ్డి ప్రతి ఫ్రేమ్‌ను ఎంతో రిచ్‌గా చూపించారు. బుచ్చిరెడ్డిగారు, విస్సు సహకారంతో సినిమా బాగా వచ్చింది'' అన్నారు.

''జీవితంలో ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. ఈ సినిమాతో నాకు మంచి కుటుంబం ఏర్పడింది'' అన్నారు సాగర్. ''దాసరి కిరణ్ ఆలోచనలు గొప్పగా ఉంటాయి. విడుదల తర్వాత సాగర్ తనకంటూ ఓ ఇమేజ్ సృష్టించుకుంటాడు'' అని కేవీ దయానంద్ అన్నారు. చిత్ర సమర్పకులు లంకాల బుచ్చిరెడ్డి, సహనిర్మాత ముత్యాల రమేశ్, దర్శకులు బి.గోపాల్, బాబీ, నిర్మాతలు రాజ్ కందుకూరి, 'మల్టీడైమన్షన్' వాసు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ, హీరో హవీష్ తదితరులు పాల్గొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com