ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం: 35 మంది మృతి

- September 04, 2016 , by Maagulf
ఆఫ్ఘనిస్థాన్‌లో ఘోర బస్సు ప్రమాదం: 35 మంది మృతి

ఆఫ్ఘనిస్థాన్‌లో ఆదివారం ఉదయంఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. కాందహార్‌ నుంచి కాబుల్‌కు ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఆయిల్‌ ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో 35 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకుని... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఉన్నతాధికారులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com