స్వచ్ భరత్ ప్రచార కర్తగా సింధు

- September 04, 2016 , by Maagulf
స్వచ్ భరత్ ప్రచార కర్తగా సింధు

ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్‌ మిషన్‌ ప్రచారకర్తలుగా రియో ఒలింపిక్స్‌ విజేతలు పీవీ సింధు, సాక్షి మాలిక్‌తో పాటు దీపా కర్మాకర్‌లను భాగస్వాములను చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తాగునీరు, పారిశుద్ధ్య కార్యదర్శి పరమేశ్వరన్‌ అయ్యర్‌ వెల్లడించారు. ఈ క్రీడాకారిణులు ఎంతో మంది గ్రామీణ మహిళలకు స్ఫూర్తిగా నిలిచారని ఆయన పేర్కొన్నారు. ఈ బృహత్తర కార్యక్రమంలో క్రీడాకారిణులను భాగస్వాములను చేసుకునేందుకు క్రీడాశాఖని సంప్రదిస్తామని చెప్పారు
స్వచ్ఛభారత్‌ కార్యక్రమం గురించి ప్రచారం చేసేందుకు 27 మంది ప్రముఖులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎంచుకున్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com