కశ్మీర్ ను సైనికుల శ్మశానవాటిక లాగ మారుస్తాం - సయెద్ సలాహుద్దీన్
- September 04, 2016
హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ ను భారతీయ సైనికుల స్మశానంగా మారుస్తామని అన్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆల్ పార్టీ మీట్ కు ముందు ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపుతోంది. ఓ ఇంగ్లీషు చానెల్ కు ప్రత్యేక ఇంటర్వూ ఇచ్చిన సలాహుద్దీన్.. కశ్మీర్ పై చర్చలు వ్యర్ధమని అన్నారు. కేవలం మిలిటెన్సీ మాత్రమే కశ్మీర్ సమస్యకు సమాధానం ఇస్తుందని చెప్పారు.
కశ్మీరీ లీడర్ షిప్, ప్రజలు, ముజాహిద్దీన్ లు కశ్మీర్ సమస్యకు శాంతియుత మార్గం లేదని తెలుసుకోవాలని పేర్కొన్నారు. ఆల్ పార్టీ మీటింగ్ కేవలం వ్యాలీలో శాంతియుత వాతావరణాన్ని సృష్టించడానికేనని చెప్పారు.
కశ్మీర్ వ్యాలీని మిలిటెంట్ల చేతుల్లోకి తీసుకోవాలని పిలుపునిచ్చారు. జులై 8న బుర్హాన్ వానీ కాల్చివేత తర్వాత మిలిటెన్సీ ఉద్యమం కొత్త మలుపు తిరిగిందని తెలిపారు. ఆర్మీని పెద్ద ఎత్తున మోహరించడం వల్ల మిలిటెన్సీ ఉద్యమం మరింత బలపడుతుందని అన్నారు. కశ్మీర్ సమస్యను ప్రభుత్వం గుర్తించకపోవడం వల్ల దీనిపై ప్రత్యేకంగా చర్చించాల్సిన పని లేదన్నారు. ఎన్నికల్లో రిగ్గింగ్ జరగడం కూడా తాను తుపాకీ పట్టడానికి ఒక కారణమని చెప్పారు.
తాజా వార్తలు
- డ్రౌనింగ్ వ్యక్తిని కాపాడిన సౌదీ పౌరుడికి దుబాయ్ పోలీసుల సత్కారం
- అయోధ్య ట్రస్టు సీఈవోగా జితేంద్ర మిశ్రా
- సౌదీ అరేబియాలో 108 మంది ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్..!!
- సూడాన్ విద్యార్థుల ఫీజులు తిరిగి చెల్లించండి..షార్జా రూలర్ ఆదేశాలు..!!
- కువైట్ సిటీలో రెసిడెన్షియల్ కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం..!!
- పిల్లల రక్షణకు యూనిసెఫ్‌తో సహకారం కొనసాగిస్తాం: ఒమన్
- అనారోగ్యంతో ఉన్న పిల్లలను స్కూల్‌కు పంపొద్దు..!!
- కువైట్‌లో నివాస సముదాయంపై డ్రోన్ దాడి.. తప్పిన ప్రాణనష్టం
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్‌టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!







