బీట్రూట్ గవ్వలు
- September 04, 2016కావలసిన పదార్థాలు: బీట్రూట్ తురుము - 2 కప్పులు, మైదా - రెండు కప్పులు, కార్న్ ఫ్లోర్ - 2 కప్పులు, ఎండుకొబ్బరి తురుము - 1 కప్పు, జీడిపప్పు పొడి - పావు కప్పు, పంచదార - 1 కప్పు, బెల్లం తురుము - 1 కప్పు, తేనె - 5 టీ స్పూన్లు, (వేడి) నెయ్యి - 3 టీ స్పూన్లు, నూనె - వేగించడానికి సరిపడా, ఏలకుల పొడి - పావు టీ స్పూను.
తయారుచేసే విధానం: బీట్రూట్లో కొద్దిగా నీరు పోసి మెత్తగా గ్రైండ్‌చేసి రసం తీసి, ఈ రసాన్ని మరిగించి పక్కన పెట్టుకోవాలి. ఒక వెడల్పాటి పాత్రలో మైదా, కార్న్‌ఫ్లోర్, కొబ్బరి తురుము, జీడిపప్పు పొడి, తేనె, నెయ్యి వేసి తగినంత బీట్రూట్ రసంతో ముద్దలా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని అరగంట పాటు నానబెట్టి తర్వాత చిన్నచిన్న ఉండలుగా చేసుకోవాలి. ఉండల్ని (గవ్వల పీటపై) గవ్వల్లా చేసుకొని నూనెలో దోరగా వేగించి పక్కనుంచాలి. మరో పాత్రలో బెల్లం, పంచదార మిగిలిన బీట్రూట్ రసం, ఏలకుల పొడి వేసి పాకం తీసి, వేగిన గవ్వలు వేయాలి. గవ్వలకు పాకం బాగా పట్టాక తీసి ఆరబెట్టుకోవాలి. గవ్వలు ఎర్రగా ఉండి చూడ్డానికి అందంగా కనిపిస్తాయిa
తాజా వార్తలు
- ఆదాయం పెంపు పై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి..
- జర్మనీలో విమానాశ్రయం మూసివేత..యూఏఈ ఫ్లైట్స్ ప్రభావితం..!
- సౌదీలో భారీ తుఫానులు..హెచ్చరికలు జారీ
- దుబాయ్‌లో AI క్యాంపస్ మొదటి దశ ప్రారంభం
- కోల్డ్ కాలింగ్ కోసం రూల్స్, ఫైన్ సెట్
- అంతర్జాతీయ కాల్స్ పట్ల జాగ్రత్త..అథారిటీ హెచ్చరిక
- ఒమన్ లో పెట్టుబడికి అనువైన వాతావరణం..!
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్