కువైట్ పర్యటనలో భారత కేంద్రమంత్రి వికె సింగ్
- September 04, 2016
భారత కేంద్ర మంత్రి (సహాయ) జనరల్ వికె సింగ్ (ఎక్సటర్నల్ బఎఫైర్స్) రెండు రోజులపాటు కువైట్‌లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి, కువైట్ అధికార వర్గాలతో కువైట్‌లోని భారతీయ వలసదారుల సమస్యలపై చర్చించనున్నారు. అలాగే జనరల్ వికె సింగ్, కువైట్‌లోని మినిస్టర్ ఆఫ్ ఫారిన్ ఎఫైర్స్, మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్, మినిస్టర్ ఆఫ్ అమిరి దివాన్ తదితరులతో చర్చలు జరుపుతారు. కువైట్‌లోని భారతీయ కమ్యూనిటీకి సంబంధించిన వివిధ అంశాలపై ఈ సందర్భంగా చర్చ జరగనుంది. కువైట్‌లోని వలసదారుల్లో భారతీయుల సంఖ్యే అధికం. బుధవారం అంటే సెప్టెంబర్ 7న ఉదయం 6.30 నిమిషాల ప్రాంతంలో ఇండియన్ ఎంబసీ ఆడిటోరియంలో కమ్యూనిటీ మెంబర్స్‌తో సమావేశమై కువైట్‌లో వలసదారులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకుంటారు. ఈ సమావేశంలో రిజిస్టర్డ్ ఇండియన్ అసోసియేషన్స్, ఇండియన్ స్కూల్స్ ప్రతినిథులు, భారతీయ కంపెనీలు మరియు పబ్లిక్ సెక్టార్ అండర్ టేకింగ్స్ ప్రతినిథులు పాల్గొంటారు. నెలల తరబడి అపరిష్కృతంగా ఉన్న అంశాలకు వికె సింగ్ పర్యటనతో మోక్షం లభిస్తుందని చాలామంది ఎదురుచూస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









