షార్జాలో ఎలక్ట్రానిక్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌

- September 04, 2016 , by Maagulf
షార్జాలో ఎలక్ట్రానిక్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌

షార్జా: ఎలక్ట్రానిక్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ అప్లికేషన్‌ సిస్టమ్‌ని మినిస్ట్రీ ఆఫ్‌ ఇంటీరియర్‌కి చెందిన స్మార్ట్‌ ఫోన్‌ యాప్‌ ద్వారా ప్రారంభిస్తున్నారు షార్జా పోలీసులు. మినిస్ట్రీకి చెందిన స్మార్ట్‌ అప్లికేషన్స్‌ (యూఏఈ ఎంఓఐ) ద్వారా ఈ సర్వీసు అందుబాటులోకి వస్తుంది. కొత్త డ్రైవర్లు రోడ్‌ టెస్ట్‌ని పూర్తి చేశాయ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కోసం యాప్‌ని వినియోగించవచ్చు. స్మార్ట్‌ అప్లికేషన్ల ద్వారా తమ ట్రాన్సాక్షన్స్‌ని పూర్తి చేసుకోవడానికి ఈ విధానాన్ని అమల్లోకి తెస్తున్నారు. ట్రాఫిక్‌ మరియు లైసెన్సింగ్‌ డిపార్ట్‌మెంట్‌ని సందర్శిచకుండానే ఈ సేవలు అందుతాయి. విలువైన సమయం వృధా అవకుండా ఈ సర్వీసుని పబ్లిక్‌ వినియోగించుకోవాలని పోలీసు అధికారి తెలిపారు. ఈద్‌ అల్‌ అదా సెలవు అనంతరం ఈ కొత్త సర్వీసు అందుబాఉటోలకి వస్తుంది. ఎలక్ట్రానిక్‌ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత మాన్యువల్‌ విధానం పూర్తిగా రద్దు చేయబడుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com