దుబాయ్ లో మదర్ థెరీసా యొక్క మహిమాన్విత కార్యక్రమంలో పాల్గొన్న భారత కాథలిక్కులు

- September 05, 2016 , by Maagulf
దుబాయ్ లో మదర్ థెరీసా యొక్క మహిమాన్విత కార్యక్రమంలో పాల్గొన్న భారత కాథలిక్కులు

దుబాయ్: ప్రవాస భారతదేశ కాథలిక్ సోదరులు  దుబాయ్ లో ఆదివారం మదర్ థెరిసా కు  సెయింట్ హుడ్ (మహిమాన్విత ) గౌరవాన్ని బహుకరించే కార్యక్రమాన్ని ఆదివారం పలుచోట్ల టీవీల ద్వారా ప్రత్యక్ష కార్యక్రమాన్ని వీక్షించారు.
దుబాయ్ లో  ఉన్న ఔడ్ మెహతా లో ఉన్న సెయింట్ మేరీస్ చర్చి  మరియు  జెబెల్ ఆలీ లో   ఉన్న సెయింట్ ఫ్రాన్సిస్ అఫ్ అస్సిసి  కాథలిక్ చర్చిలు వద్ద  నోబెల్ బహుమతి గ్రహీత, భారతరత్నమదర్ థెరిస్సా యొక్క  కట్ అవుట్స్ , ఫోటో ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. చర్చి లోపల దేవుని సన్నిధి సమీపంలోని  ఆల్టర్ వద్ద  భక్తులు ఆమె గూర్చి ప్రభువుని  స్తుతించారు. " పేదల మధ్య నుంచి పునీతురాలిగా "  దేవుడు ఆమెని మహిమ రాజ్యంలో ఉన్నత స్థానంని ఆమెకు దేవుడు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలను తెలియచేసారు.   ఆదివారం ఇటలీ లోని రోమ్ నగరంలో పోప్ ఫ్రాన్సిస్ రోమన్ కాథలిక్ చర్చి తరుపున  సెయింట్ హుడ్ ( మహిమాన్వితరాలిగా) ఆమెకు అధికారికంగా ప్రకటించబడింది.

ఈ రోజు ఆదివారం కావడంతో, మేము ఒక అరబిక్ ఆరాధనా కార్యక్రమంతో  సహా ఎనిమిది ఆరాధనా కార్యక్రమాలు నిర్వహించామని, ఈ సమయంలో, మేము మదర్ తెరెసా అఫ్ కలకత్తా గురించి దేవునికి మొర పెట్టినట్లు  ఒక, సెయింట్ మేరీస్ చర్చి యొక్క  సంఘ కాపిరి జె. జేమ్స్ "  మా గల్ఫ్ డాట్ కామ్ " కు తెలిపారు. అభాగ్యుల కోసం దేవాధిదేవుడు  ఆ  తల్లిని  ప్రోత్సహించడంపై  దేవునికి  ధన్యవాదాలు తెలిపినట్లు ఆయన తెలిపారు."ప్రజలు స్తుతించటానికి మరియు శుక్రవారం నుంచి ప్రార్థనలు జరిపేందుకు  బలిపీఠము సమీపంలో మదర్ థెరీసా యొక్క  ఒక అందమైన కట్ ఔట్ ఉంచుతారు. సెయింట్ మదర్ తెరెసా యొక్క చిత్రం అలాగే ఉంచి  భవిష్యత్తులో చర్చి లో ఉంచబడుతుందని అన్నారాయన. జెబెల్ ఆలీ చర్చిలో  ఆదివారం జరిగిన ఆరాధన కార్యక్రమంలో  మదర్ థెరీసా యొక్క జీవిత విశేషాలు గురించి వివరిస్తూ దేవుడు తన ప్రేమను చూపించడానికి మదర్ థెరీసా వంటి వ్యక్తులను ఎంచుకొంటారని     పారిష్ లో ఒక సహాయక  ఫాదర్  విల్సన్ క్లిఫోర్డ్ తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com