'ఇజం' టీజర్ విడుదల

- September 05, 2016 , by Maagulf
'ఇజం' టీజర్ విడుదల

బాక్స్‌ఆఫీస్ వద్ద జనతా గ్యారేజ్ చేస్తున్న సందడిని చూసి మురిసిపోతున్న నందమూరి అభిమానులకు హీరో నందమూరి కళ్యాణ్‌రామ్ మరో కానుక అందించారు. కళ్యాణ్ రామ్ తన తదుపరి చిత్రం 'ఇజం' టీజర్‌ను విడుదల చేశారు. సోషల్ మీడియాలో టీజర్‌కు మంచి స్పందన వస్తోంది. టీజర్‌ను చూస్తే బట్టి చూస్తే సినిమా పక్కా మాస్, యాక్సన్ ఓరియెంటెడ్‌లా, పూరీ జగన్నాథ్ మార్క్ స్పష్టంగా కనబడుతోంది. సిక్స్ ప్యాక్‌తో కనిపిస్తున్న కళ్యాణ్ రామ్ పక్కా మాస్ యాక్సన్ హీరోలా కనిపిస్తున్నాడు. ఈ చిత్రాన్ని పూరీ జగనాథ్ డైరెక్ట్ చేస్తుండగా ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com