'మిస్ జపాన్' కిరీటాన్ని గెలుచుకున్న భారత సంతతి..
- September 06, 2016
భారత మూలాలున్న జపాన్ అందాల సుందరి ప్రియాంక యోషికవా (22) 'మిస్ జపాన్' కిరీటాన్ని గెలుచుకున్నరు. భారతీయుడైన తండ్రి, జపాన్ దేశస్థురాలైన తల్లి అందచందాలన్నీ పుణికి పుచ్చుకున్న పొడగరి (5 అడుగుల8 అంగుళాలు) ప్రియాంకకు ఏనుగుల శిక్షకురాలిగా అధీకృత లైసెన్స్ ఉండటం మరో ప్రత్యేకత. తాను ఎన్నోసార్లు జాతి సంబంధమైన సమస్యలను ఎదుర్కొన్నట్లు ఆమె తన విజయానంతరం మాట్లాడుతూ....ఉద్వేగంగా చెప్పారు. జపాన్ కాలమానం ప్రకారం సోమవారం ఆమె 'మిస్జపాన్' పోటీలో విజేతగా నిలిచారు. ఇప్పుడిక డిసెంబరులో వాషింగ్టన్లో జరగనున్న 'మిస్ వరల్డ్' పోటీల్లో ఆమె పాల్గొంటారు.ఇతర దేశాలు, జాతుల మూలాలున్న వారు ఇలాంటి అందాల పోటీల్లో ఇదివరకెన్నడూ జపాన్‌కు ప్రాతినిధ్యం వహించలేదు. ఇటీవలే నల్లజాతి మూలాలున్న యువతి అరియానా మియామోటో జపాన్‌కు ప్రాతినిధ్యం వహించడంతో సామాజిక మాధ్యమాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ప్రియాంక అందాల సుందరి కిరీటాన్ని గెలుచుకోవడం ప్రత్యేకతను సంతరించుకుంది. తనలా ఇతర దేశాల మూలాలను కలిగిన వారెవరూ ప్రాతినిధ్యం వహించలేకపోవడాన్ని ప్రియాంక ప్రస్తావిస్తూ...అరియానా తనను ఎంతగానో ప్రోత్సహించిందని పేర్కొన్నారు. జపాన్‌లోని సజాతీయతా భావజాలంపై తన పోరాటాన్ని కొనసాగిస్తానని ప్రియాంక యోషికవా తెలిపారు.టోక్యోలోనే పుట్టిన ప్రియాంక కొన్నేళ్లపాటు శాక్రమెంటో, ఓ ఏడాది పాటు భారత్‌లో ఉండి...పదేళ్ల వయసులో జపాన్‌కు తిరిగి వచ్చారు. తనలాగే ఇతర దేశాల మూలాలున్న ఎంతోమంది ఎన్నోరకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. తనను ఓ పురుగుతో సమానం'గా భావించారనీ...తనను తాకితే మైలపడిపోతామన్నట్లు ప్రవర్తించినవారూ ఉన్నారని ఆమె ఆవేదనగా చెప్పారు. అయితే, ఈ పరిణామాలన్నీ కూడా తనను మరింత రాటుదేల్చాయంటూ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







