నారా లోకేష్ రాజకీయ అరంగేట్రానికి తెరలేపిన బాబు..
- September 06, 2016
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిరవధికంగా కాంగ్రెస్ పరిపాలిస్తున్న కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల సమస్యల పట్ల ఆకర్షితుడై, వారి సమస్యలను తన సమస్యలుగా భావించి తెలుగు ప్రజల పేరుమీద తెలుగుదేశం పార్టీని స్థాపించి మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం గా పేరు గాంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆదరాభిమానాల్ని చూరగొంది తెలుగుదేశం పార్టీ. అంతటి ఘన చరిత్ర కలిగిన పార్టీ ఎన్టీఆర్ అనంతరం పార్టీ పగ్గాలను చేపట్టిన చంద్రబాబు పార్టీని విజయవంతంగా నడిపించడంలో సఫలం అయ్యారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అత్యధికకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడిగా బాబు రికార్డును సైతం నెలకొల్పారు.
ఆ తర్వాత తన కుమారుడైన నారా లోకేష్ రాజకీయ అరంగేట్రానికి తెర లేపారు బాబు.
ప్రస్తుతం లోకేష్ తెలుగుదేశం పార్టీ యువజన విభాగం జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్న లోకేష్ కు మంత్రి పదవిని కట్టబెట్టాలని మంత్రులందరూ డిమాండ్ చేసిన విషయం అందరికీ విదితమే. అయితే ఈ విషయాలన్నింటినీ పరిశీలిస్తున్న బాబు వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తే తన కుమారుడికి ఏకంగా ఉప ముఖ్యమంత్రి పదవిని కట్టబెట్టాలని సమాలోచనలు చేస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
అయితే ముఖ్యమంత్రులు తమ కుమారులను ఉప ముఖ్యమంత్రులుగా నియమించడం ఎప్పటి నుంచో కొనసాగుతూ వస్తోంది. తమిళనాడు లో డీఎంకే పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఆయన కుమారుడు స్టాలిన్ ను ఉప ముఖ్యమంత్రిగా నియమించిన విషయం అందరికీ తెలిసిందే. అంతేకాక బీహార్ రాష్ట్రంలో జనతాదళ్ కూటమి అధికారంలోకి వచ్చిన అనంతరం లాలు ప్రసాద్ యాదవ్ తన తనయుడిని డిప్యుటీ సీఎం గా నియమించారు.ఇలా ప్రస్తుత రాజకీయ వారసత్వ పరిణామాలను గమనిస్తూ వస్తున్న బాబు లోకేష్ కు వచ్చే ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిని చేయాలని ప్రణాళికలు రచిస్తున్నారు. అందుకే అందరూ డిమాండ్ చేస్తున్నా ఆయనకీ మంత్రి పదవిని బాబు కట్టబెట్టడం లేదు. ఎలాగు బాబు తర్వాత పార్టీ అధ్యక్షుడిగా లోకేష్ అధికార బాధ్యతలు స్వీకరించాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటి నుంచే బాబు ఆ ప్రక్రియకు లోకేష్ ను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







