ఇన్సాట్-3డీఆర్ ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధo..
- September 07, 2016
ఇన్సాట్-3డీఆర్ ఉపగ్రహ ప్రయోగానికి రంగం సిద్ధమైంది. దీనికోసం నిర్వహించే కౌంట్‌డౌన్ ప్రక్రియ ఈరోజు ఉదయం 11.10 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 29 గంటల పాటు కొనసాగనుంది. వాతావరణ పరిస్థితులన్నీ అనుకూలిస్తే గురువారం సాయంత్రం 4.10 గంటలకు జియోసింక్రనస్ లాంచ్ వెహికల్(జీఎస్ఎల్వీ)-ఎఫ్05 వాహకనౌక ద్వారా ఉపగ్రహాన్ని భూస్థిర కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నారు. ఈ ప్రయోగానికి నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ వేదిక కానుంది.ఇన్సాట్-3డీఆర్ ఉపగ్రహం వాతావరణ శాస్త్ర అధ్యయనంతో పాటు మరింత కచ్చితత్వంగా పరిశోధన చేయనుంది.సముద్ర గాలి దిశలను గమనించి వాతావరణ పరిశోధనలకు చేయూత అందించనుంది. ఇది పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన ఆధునిక ఉపగ్రహం. ఇన్సాట్-3డీఆర్‌లో మెరుగైన ఇమేజింగ్ వ్యవస్థ, వాతావరణంలోని శబ్ధ తరంగాలను అన్వేషించే వ్యవస్థ ఉంది. తద్వారా వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి విపత్తుల సమయంలో అప్రమత్తం చేసే వీలుంటుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







