సూపర్ స్టార్స్ ఇద్దరూ ఒకే స్టూడియో లో...
- September 07, 2016
టైటిల్ ని చూసి సూపర్ స్టార్ రజనీకాంత్ - ప్రిన్స్ మహేష్ బాబు మల్టీస్టారర్ ఓకే అయ్యింది అనుకునేరూ ! ఈ మేటరు వేరు. నిజానికి రజనీ-మహేష్.. ఒకే స్టూడియో అని చెప్పాలి. ఏదో ఆసక్తిగా ఉంటుందని రజనీ-మహేష్.. ఒకే సెట్ లోని పెట్టేశాం.ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. ? ప్రస్తుతం రజనీ కాంత్ శంకర్ రోబో 2.0 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. చెన్నైలోని ఈవీపీ ఫిలిం సిటీలో ఈ చిత్రం షూటింగ్ కొనసాగుతోంది. ఇక, హైదరాబాద్ షెడ్యూల్ తర్వాత కాస్త విరామం తీసుకొన్న మహేష్ - మురగదాస్ చిత్రం చెన్నై షెడ్యూల్ కి రెడీ అవుతోంది. ఈరోజు (సెప్టెంబర్ 7) నుంచి చెన్నైలోని ఈవీపీ ఫిలిం సిటీ ప్రత్యేకంగా వేసిన సెట్ లో షూటింగ్ జరగనుంది. అది కూడా రజనీ రోబో2 సెట్ కి ప్రక్కన వేసిన సెట్ లో.దీంతో ఇద్దరు సూపర్ స్టార్స్ ప్రక్క ప్రక్కనే యాక్షన్ లోకి దిగుతున్నారన్న మాట.మరీ.. షూటింగ్ గ్యాప్ లో మహేష్ సూపర్ స్టార్ రజనీ కాంత్ తో ముచ్చటించేందుకు వెళ్లే అవకాశాలున్నట్టు సమాచారమ్. ఈ చర్చల్లో వీరి మల్టీస్టారర్ చిత్రం ఓకే అయిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. మొత్తానికి.. సూపర్ స్టార్స్ ఇద్దరూ ఒకే స్టూడియో అన్న న్యూస్ భలే కిక్కునిస్తోంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







