పవన్ బర్త్ డే రోజు 565K+ ట్వీట్స్ వచ్చాయి..!
- September 07, 2016
పవన్ కళ్యాణ్ ఆయన ఒక ప్రభంజనం. ఆయన సినిమా కోసం అభిమానులు వేయికళ్ళతో ఎదురు చూస్తుంటారు. ఇక ఆయన నడిచే దారిలోనే తాము పయనించాలని ప్రయత్నాలు చేస్తుంటారు. పవన్‌కి సంబంధించిన ఏ విషయమైన చాలు వెంటనే వారు స్పందిస్తారు. సెప్టెంబర్ 2న పవన్ బర్త్ డే కాగా అభిమానులు ఆయన 46వ బర్త్ డే వేడుకలని గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. పవన్ మాత్రం ఈ పార్టీలకు దూరంగా ఉన్నాడు. అయితే పవన్ బర్త్ డే రోజు అభిమానులు సోషల్ మీడియాలో విష్ చేస్తూ ట్వీట్లతో హోరెత్తించారు . ఆ ఒక్క రోజే #HBDPawanKalayan హ్యష్ ట్యాగ్‌తో 565K+ ట్వీట్స్ వచ్చాయి. దీంతో పవన్ గతంలో తల అజిత్ పై ఉన్న రికార్డును చెరిపేశాడు. అజిత్ బర్త్ డే రోజున 430K ట్వీట్స్ వచ్చిన సంగతి తెలిసిందే.పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో కాటమరాయుడా అనే చిత్రాన్ని చేస్తోండగా, సెప్టెంబర్ రెండవ వారంలో పవన్ యూనిట్‌తో కలవనున్నాడని టాక్. ఈ చిత్రం తర్వాత పవన్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







