ఆటోమేటిక్ డోర్ లాక్ వలన కారులో చిక్కుకున్న చిన్నారి
- September 07, 2016
శంషాబాద్ విమానాశ్రయ రహదారిలో కారు డోర్లు ఆటోమేటిక్‌గా లాక్ కావడంతో ఓ చిన్నారి చిక్కుకుపోయింది. రెండేళ్ల ఆ చిన్నారిని తల్లిదండ్రులు కారులోనే వదిలి టిఫిన్ చేసేందుకు వెళ్లారు. పాప కారులోనే ఉంది.వాళ్లు తిరిగి వచ్చారు. అప్పటికే డోర్లు లాకయ్యాయి. దీంతో తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అక్కడకు చేరుకున్న స్థానికులు కారు అద్దాలను పగులగొట్టి చిన్నారిని రక్షించారు. దీంతో తల్లిదండ్రులు, అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు.కారు బీభత్సంసికింద్రాబాద్‌లోని రైల్ నిలయం సమీపంలో ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది.అదుపుతప్పి పుట్‌పాత్‌పై ఉన్న చెరకు బండి, టీ స్టాల్‌ను ఢీకొట్టింది. సంగీత్ చౌరస్తా నుంచి తార్నాక - ఉప్పల్ వైపు వెళ్తున్న హ్యుందాయ్ కారు అధిక వేగంతో అదుపుతప్పి, వాటిని ఢీకొట్టింది.
అనంతరం పక్కనే ఉన్న ప్రహరీ గోడను బలంగా ఢీకొని ఆగింది. ప్రమాదం సమయంలో జనాలు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు కూడా సీటు బెల్టు పెట్టుకున్నారు. దీంతో వారికి కూడా గాయాలు కాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు
తాజా వార్తలు
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి







