దర్శకుడిగా ధనుష్...
- September 07, 2016
హీరో ధనుష్ మరో కొత్త అవతారం ఎత్తాడు. నటుడు, గాయకుడు, గీత రచయితగా, నిర్మాతగా మంచి మార్కులు కొట్టేసిన ఈ హీరో తాజాగా మెగాఫోన్ పట్టాడు. ప్రముఖ నటుడు రాజ్ కిరణ్ ప్రధాన పాత్రలో 'పవర్ పాండి' అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఈ విషయాన్ని ధనుష్ అధికారికంగా ధ్రువీకరించాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా విడుదల చేశారు. దర్శకుడిగా ఈ సినిమా ధనుష్‌కి తొలి చిత్రం కాగా దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.రాజ్ కిరణ్ తో పాటు ఈ చిత్రంలో ప్రసన్న, చాయసింగ్ నటిస్తున్నారు. కాగా కబాలి చిత్రానికి సంగీతం అందించిన షాన్ రోల్డాన్ ... ఈ చిత్రానికి కూడా మ్యూజిక్ అందించనున్నారు.అలాగే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులను త్వరలో ప్రకటించనున్నారు.అయితే ఈ చిత్రంలో ధనుష్ నటిస్తాడా? లేదా?అన్నది మాత్రం సస్పెన్స్. ప్రస్తుతం ధనుష్ గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో 'ఎన్నై నోక్కి పాయుమ్ తూట్టా' చిత్రంలో నటిస్తున్నాడు. అలాగే ధనుష్ త్వరలో తన సొంత బ్యానర్ పై రజనీకాంత్ తో ఓ చిత్రాన్ని పట్టాలెక్కించబోతున్నాడు. ఈ చిత్రానికి పా.రంజిత్ దర్శకత్వం వహించనున్నాడు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..
- అల్ ఐన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కొత్త పేరు..
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు







