కేంద్ర మంత్రి వికె సింగ్‌కి కువైట్ ఘన స్వాగతం
- September 07, 2016
కువైట్: కువైట్‌లోని ఇండియన్ ఎంబసీ, కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జనరల్ వికె సింగ్‌కి ఇండియా హౌస్ వద్ద ఘన స్వాగతం పలికింది. రెండు రోజుల అధికారిక పర్యటన కోసం కువైట్‌కి విచ్చేశారు వికె సింగ్. కువైట్‌లోని భారత రాయబారి సునీల్ జైన్, కేంద్ర మంత్రికి ఘన స్వాగతం పలికిన కార్యక్రమంలో పాల్గొన్నారు. పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ మరియు పారిన్ ఎఫైర్స్ మినిస్టర్ షేక్ సబా ఖాలెద్ అల్ హమాద్ అల్ సబా మరియు కువైటీ అధికారులతో అంతకు ముందు భారత కమ్యూనిటీ కువైట్‌లో ఎదుర్కొంటున్న సమస్యలపై వికె సింగ్ చర్చించారు. ఈ రోజు వికె సింగ్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ ఎఫైర్స్ మరియు లేబర్ హింద్ అల్ సుబైయా మరియు ఇంటీరియర్ మినిస్టర్‌తో పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఇంకో వైపున కమ్యూనిటీ ఇంటరాక్షన్‌ని సాయంత్రం ఆరున్నర గంటలకు ఇండియన్ ఎంబసీ ఏర్పాటు చేసింది. కువైట్‌లోని పలు రిజిస్టర్డ్ అసోసియేషన్స్, ఇండియన్ స్కూల్స్ ప్రతినిథులు, ఇండియన్ ప్రైవేట్ సెక్టార్ కంపెనీల ప్రతినిథులు, పబ్లిక్ సెక్టార్ అండర్‌టేకింగ్స్, మీడియా ప్రతినిథులకు ఈ మేరకు ఆహ్వానం అందింది.
తాజా వార్తలు
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!







