'సాయే దైవం' చిత్రం పాటల విడుదల

- September 07, 2016 , by Maagulf
'సాయే దైవం' చిత్రం పాటల విడుదల

విజయచందర్ సాయిబాబాగా నటించిన తాజా చిత్రం 'సాయే దైవం'. జీఎల్‌బీ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తూ, పొనుగోటి భవాని అర్జున్‌రావుతో కలిసి నిర్మించారు. ఘటికాచలం సంగీతం అందించిన ఈ చిత్రం పాటల సీడీని విజయచందర్ విడుదల చేశారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసన మండలి చైర్మన్లు చక్రపాణి, స్వామిగౌడ్, జస్టిస్ చంద్రయ్య హాజరయ్యారు. ''బాబా భక్తుల అనుభవాల నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. దసరాకు రిలీజ్ చేయాలనుకుంటున్నాం'' అని దర్శక-నిర్మాతలు అన్నారు. ''30 ఏళ్ల క్రితం 'శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం'లో సాయిబాబా పాత్ర చేశా. మళ్లీ ఆ పాత్ర చేసే చాన్స్ రావడం నా అదృష్టం'' అని విజయచందర్ అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com