‘పత్తు సుందరిగళ్’ అంటే.. పదిమంది సుందరీమణులు..
- September 07, 2016
ఇక్కడున్న ఫొటోని చూడ్డానికి రెండు కళ్లూ చాలడంలేదు కదూ! కేరళ సంప్రదాయ చీరలో తారలందరూ తళుక్కుమంటే చూసే కొద్దీ చూడబుద్ధవుతోంది కదూ! ఫొటోలో మన తెలుగింటి కోడలు అమల, హైదరాబాదీ భామ టబు, తమిళింటి ఆడపడుచులు రాధిక, శ్రీప్రియ... ఇలా అందరూ కేరళ స్టైల్ చీర కట్టుకుని ఎక్కడ మెరిసినట్లు? ఆ విషయానికే వస్తున్నాం.ఇటీవల రాధిక కుమార్తె రేయాన్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. చెన్నైలో జరిగిన ఆ వేడుకకు దక్షిణ, ఉత్తరాది చిత్రసీమ నుంచి పలువురు ప్రముఖ తారలు హాజరయ్యారు. ఈ వేడుకకు హాజరైనవాళ్లలో కొంతమంది కేరళలో జరిగిన లక్ష్మి తనయుడు వరుణ్ పెళ్లికి వెళ్లారు. ఒకప్పటి ప్రముఖ తారలు, తమిళ, మలయాళ పరిశ్రమల్లో ట్రివాంకూర్ సిస్టర్స్‌గా పేరు, ప్రతిష్ఠలు సాధించిన పద్మిణి-రాగిణి-లలితల మనవడే వరుణ్.రాగిణి కూతురు లక్ష్మి. కేరళలోని ట్రివాంకూరులో జరిగిన వరుణ్ పెళ్లికి వెళ్లిన వాళ్లల్లో రాధిక, శ్రీప్రియ, లిజి, అమల, టబు, జ్యోతిక తదితరులు ఉన్నారు. పెళ్లి కేరళలో కాబట్టి, అక్కడి సంప్రదాయానుసారంగా చీర కట్టుకుని, నగలు పెట్టుకుని.. ఇలా ఫొటో దిగారు. ఈ 'పత్తు సుందరిగళ్' అంటే.. పదిమంది సుందరీమణులు వివాహ వేడుకకు నిండుదనం తెచ్చి ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







