'ఇంకొక్కడు' రివ్యూ
- September 08, 2016
టైటిల్ : ఇంకొక్కడు
జానర్ : సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్
తారాగణం : విక్రమ్, నయనతార, నిత్యామీనన్, నాజర్, తంభి రామయ్య
సంగీతం : హారిస్ జయరాజ్
దర్శకత్వం : ఆనంద్ శంకర్
నిర్మాత : శింబు తమీన్స్
నటుడిగా తనకు తిరుగలేదని నిరూపించుకున్న చియాన్ విక్రమ్ చాలా రోజులుగా కమర్షియల్ సక్సెస్ లు సాధించటంలో మాత్రం వెనుక పడుతూనే ఉన్నాడు. ఎక్కువగా కమర్షియల్ ఫార్మాట్ కు దూరంగా ప్రయోగాత్మక చిత్రాలు చేస్తుండటం కూడా విక్రమ్ ఫెయిల్యూర్స్ కి కారణం అన్న టాక్ ఉంది. అయితే మరోసారి తానే హీరోగా, విలన్ గా నటిస్తూ రూపొందించిన ఇంకొక్కడు(ఇరుముగన్) చిత్రంతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు చియాన్.
మరి ఇంకొక్కడు, విక్రమ్ కు సక్సెస్ ఇచ్చాడా..?
కథ :
మలేషియాలోని ఇండియన్ ఎంబసీ మీద ఓ 70 ఏళ్ల వృద్ధుడు దాడి చేసి 20 మంది భారతీయ పోలీసుల్ని చంపటంతో సినిమా మొదలవుతోంది. లవ్ (విక్రమ్) అనే కెమికల్ సైంటిస్ట్ రూపొందించిన ఓ డ్రగ్ వల్లనే వయసు అయిపోయిన వ్యక్తి కూడా దాడి చేయగలిగాడని తెలుస్తుంది. లవ్ రూపొందించిన స్పీడ్ డ్రగ్ తీసుకుంటే 5 నిమిషాల పాటు మనిషికి అద్వితీయ మైన శక్తి వస్తుంది. ఈ డ్రగ్ ను ఉగ్రవాదులకు అమ్మే ఉద్దేశ్యంలో ఉంటాడు లవ్.
అయితే ఎంబసీ మీద జరిగిన దాడితో ఎలర్ట్ అయిన ఇండియన్ పోలీస్, గతంలో లవ్ కేసును డీల్ చేసి, నాలుగేళ్లుగా సస్పెన్షన్ లో ఉన్న, రా ఆఫీసర్ అఖిలన్ వినోద్(విక్రమ్)కు ఈ కేసు బాధ్యతలను అప్పగిస్తారు. లవ్ కారణంగానే తన భార్యను పొగొట్టుకున్న అఖిల్, లవ్ ను అంతమొందించడానికి నిర్ణయించుకుంటాడు. మరో రా ఆఫీసర్ ఆరుషి(నిత్యామీనన్)తో కలిసి మలేషియాలో అడుగుపెట్టిన అఖిల్ అక్కడ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు. చివరకు లవ్ కథను ఎలా ముగించాడు అన్నదే మిగతా కథ.
నటీనటులు :
జాతీయ స్థాయి నటుడిగా ఇప్పటికే చాలా సార్లు ప్రూవ్ చేసుకున్న విక్రమ్ ఈ సినిమాతో మరోసారి తనలోని నటుణ్ని అద్భుతంగా తెర మీద ఆవిష్కరించాడు. సిన్సియర్ రా ఆఫీసర్ గా కనిపిస్తూనే గే లక్షణాలున్న క్రూయల్ సైంటిస్ట్, లవ్ పాత్రలోనూ ఆకట్టుకున్నాడు. రెండు పాత్రల మధ్య మంచి వేరియేషన్స్ చూపించిన విక్రమ్ నటుడిగా తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నాడు. రా ఆఫీసర్లుగా నయనతార, నిత్యామీనన్ లు ఆకట్టుకున్నారు. ముఖ్యంగా నయన్ గ్లామర్ షో సినిమాకు మరింత ప్లస్ అయ్యింది. నాజర్, తంబి రామయ్య లాంటి నటులు తమ పరిథి మేరకు అలరించారు.
సాంకేతిక నిపుణులు :
హీరో విక్రమ్ తో తొలిసారిగా పూర్తి స్థాయి విలన్ రోల్ చేయించిన దర్శకుడు ఆనంద్ శంకర్ అందరి దృష్టిని ఆకర్షించాడు. విక్రమ్, నయనతార, నిత్యామీనన్ లాంటి నటీనటులను ఒప్పించిన దర్శకుడు అందుకు తగ్గ స్థాయిలో కథా కథనాలను సిద్ధం చేయలేకపోయాడు. యాక్షన్ సీన్స్, ట్విస్ట్ లు అలరించి నా.. చాలా చోట్ల సినిమా బాగా స్లో అయ్యిందన్న ఫీలింగ్ కలుగుతోంది. కొన్ని సన్నివేశాలు ఏ మాత్రం లాజిక్ లేనట్టుగా అనిపిస్తాయి.
విక్రమ్ లుక్స్, విలన్ క్యారేక్టరైజేషన్ లాంటి అంశాలు మాత్రం ఆకట్టుకుంటాయి. హారిస్ జయరాజ్ సంగీతం కూడా ఆశించిన స్థాయిలో లేదు. అయితే పాటలతో నిరాశపరిచిన హారిస్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో అలరించాడు. కీలక సన్నివేశాల్లో నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్స్ :
విక్రమ్ నటన
నేపథ్య సంగీతం
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్ ప్లే
పాటలు
ఓవరాల్ గా ఇంకొక్కడు, నటుడిగా విక్రమ్ స్థాయిని మరో మెట్టు ఎక్కించినా, తన స్థాయికి తగ్గ కమర్షియల్ సక్సెస్ మాత్రం అందించకపోవచ్చు.
తాజా వార్తలు
- దుబాయ్: అల్ బర్షాలో వాహనం పై శిథిలాలు పడి ఒకరు మృతి
- ఇరాన్ ఓ లూజర్.. చాలా తీవ్రంగా దెబ్బతింటుంది: డొనాల్డ్ ట్రంప్
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!









