మరో భారత్ ను తలపిస్తున్న అమెరికా
- September 08, 2016
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇతర దేశాల నుంచి వస్తున్న ప్రజల వలసలే ప్రధాన సమస్యగా మారింది. ముఖ్యంగా అధ్యక్షపదవికి రిపబ్లికన్ల తరఫున పోటీచేస్తున్న డోనాల్డ్ ట్రంప్ ప్రచారమంతా ఈ సమస్య చుట్టే తిరుగుతోంది. పొరుగున్న మెక్సికో నుంచి పెరుగుతున్న వలసలను నియంత్రిస్తానని ఆయన చెబుతున్నారు. వాస్తవానికి మెక్సికో నుంచి వలసలు గతంతో పోలిస్తే బాగా తగ్గాయి. ఇప్పుడు అగ్రస్థానంలో భారత దేశమే ఉందని, మెక్సికో కనీసం రెండో స్థానంలో కూడా లేదని, చైనా తర్వాతనే మెక్సికో ఉందని 'వాల్‌స్ట్రీట్ జర్నల్' తాజా విశ్లేషణలు చెబుతున్నాయి. 2012 నుంచి 2014 వరకు అందుబాటులో ఉన్న వలసల గణాంకాలను మాత్రమే పరిగణనలోకి తీసుకొని ఈ విశ్లేషణలు చేసింది.
వలసల్లో అక్రమ వలసలు, చట్టబద్ధంగా వచ్చిన వలసలు ఉన్నాయి. ఇతర దేశాల సంతతికి చెందినవారిని కాకుండా ఇతర దేశాల్లో పుట్టి అమెరికాకు వచ్చి స్థిరపడిన వారినే వలసల గణాంకాల్లోకి తీసుకున్నారు. భారత్ నుంచి మెక్సికో కన్నా భారీగా వలసలు పెరిగాయంటే దానర్థం అమెరికాలో ప్రస్తుతం మెక్సికోలకన్నా భారతీయులు ఎక్కువగా ఉన్నారన్న అర్థం కాదు.
మెక్సికోలో పుట్టి అమెరికాలో స్థిరపడినవారి సంఖ్య 1.10 కోట్లు కాగా, భారత్‌లో పుట్టి అమెరికాలో స్థిరపడినవారి సంఖ్య 22 లక్షలు. ఇతర దేశాల్లో పుట్టి అమెరికాలో వచ్చి స్థిరపడిన మొత్తం వలస ప్రజల్లో మెక్సికన్ల సంఖ్య 27.9 శాతం కాగా, భారతీయుల సంఖ్య 5.2 శాతం. 2012 నుంచి అమెరికాకు వలసవచ్చే మెక్సికన్ల, చైనీయుల సంఖ్య బాగా పడిపోయినా, భారతీయుల సంఖ్య మాత్రం పెరగుతూనే వస్తోంది.
మెక్సికోలో, చైనాలో ఉద్యోగావకాశాలు పెరగడమే అమెరికాకు ఆయా దేశాల నుంచి వలసలు తగ్గడానికి కారణమని సామాజిక శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. ఇంజనీర్లు, ఐటీ ప్రొఫెషనర్లకు ఇప్పటికీ అమెరికాలో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉండటంతో భారతీయులు అమెరికాకు క్యూ కడుతున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్‌తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్‌పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









