'కింగ్' నాగార్జున స్థానంలో మెగాస్టార్ ..
- September 09, 2016
దాదాపు పదేళ్లపాటు వెండితెరకు దూరమై ఇప్పుడు మళ్లీ ముఖానికి రంగేసుకున్నారు మెగాస్టార్ చిరంజీవి. వినాయక్ దర్శకత్వంలో 'ఖైదీ నెంబర్ 150' సినిమాలో నటిస్తున్నారు. ఇప్పటికే సగానికి పైగా షూటింగ్ పూర్తయిన ఈ సినిమా సంక్రాంతికి విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఆ తర్వాత కూడా సినిమాలు కొనసాగిస్తానని మెగాస్టార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, అభిమానుల ఆనందాన్ని రెట్టింపు చేయడానికి మెగాస్టార్ బుల్లితెరపై కూడా సందడి చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తిచేసుకున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' ప్రోగ్రామ్‌ను ఇకపై చిరు నడిపించనున్నారట. అంటే 'కింగ్' నాగార్జున స్థానంలో మెగాస్టార్ కనబడనున్నారన్నమాట.ఈ కార్యక్రమం డిసెంబర్లో ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఉత్తరాదిన ఘనవిజయం సాధించిన అమితాబ్ 'కౌన్ బనేగా కరోడ్‌పతి' కార్యక్రమానికి తెలుగు వెర్షనే 'మీలో ఎవరు కోటీశ్వరుడు'. అంటే అమితాబ్‌ను ఆదర్శంగా తీసుకుని చిరంజీవి కూడా క్విజ్ మాస్టర్ అవతారం ఎత్తనున్నారన్నమాట.
తాజా వార్తలు
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- 2025లో యూఏఈ వీసా నియమాల్లో కీలక మార్పులు..!!
- కువైట్ లో పలు మీట్ షాప్స్ సీజ్..!!
- రసాయన ఆయుధాల నిషేధంపై కమిటీ ఏర్పాటు..!!
- టాక్సీ యజమానులకు జరిమానా మినహాయింపు..!!
- గూగుల్ జెమినీ 3కి పోటీగా chatgpt 5.2..
- ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కర్టెన్ రైజర్ ఆవిష్కరణ







