పూర్తి స్థాయిలో రాజకీయాలవైపు దృష్టి : పవన్ కల్యాణ్

- September 09, 2016 , by Maagulf
పూర్తి స్థాయిలో రాజకీయాలవైపు దృష్టి : పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్ ఇప్పుడు పూర్తి స్థాయిలో రాజకీయాలవైపు దృష్టి పెట్టాడు. అందుకు తగిన సమయం కూడా ఇదే. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్ర ప్రదేశ్ అట్టుడికి పోతోంది. ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపించడానికి పవన్ డిసైడ్ అయ్యాడు. అందుకోసం మూడంచెల ఉద్యమ పథకాన్ని పవన్ ప్రకటించాడు కూడా. అయితే అంతకీ వీలుకాని పక్షంలో.. పవన్ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొంటాడని తెలుస్తోంది. దానికి అమరావతిని వేదిక చేసుకొంటాడని సమాచారం అందుతోంది. నిరాహార దీక్షపై పవన్ తనకు అత్యంత సన్నిహితులతో చర్చలు జరుపుతున్నట్టు... దీనిపై త్వరలోనే ఓ స్పష్టమైన ప్రకటన చేయబోతున్నట్టు సమాచారం. పవన్ నిరాహార దీక్షకు పూనుకొంటే.. ఇక మామూలుగా ఉండదు. ఓ పాపులర్ హీరో రోడ్డుమీదకొస్తే...తన అభిమానులు వెన్నంటి నిలిస్తే... ప్రభుత్వమే స్థంభించిపోతుంది. అందుకే పవన్ వేసే ఎత్తుగడలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఓ కంట కనిపెడుతూనే ఉన్నాయని సమాచారం. ప్రత్యేక హోదా కోసం పూర్తి స్థాయిలో ఉద్యమించడానికి ఇదే సరైన సమయమని, ఇప్పుడుకాకపోతే ఇంకెప్పుడూ ఈ అవకాశం రాదని పవన్ భావిస్తున్నాడట.ఈ ఉద్యమాన్ని 2019 ఎన్నికలకు టేకాఫ్ గా తీసుకోవాలని పవన్ భావిస్తున్నాడు. పవన్‌కి అత్యంత సన్నిహితులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారని సమాచారం. కాకినాడ సభలో ఆమరణ నిరాహార దీక్ష గురించి చెప్పినా, చెప్పకపోయినా.. పవన్ నిర్ణయం తీసేసుకొన్నాడని సమాచారం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com