బాగ్దాద్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది...
- September 09, 2016
ఇరాక్ రాజధాని బాగ్దాద్ నగరం మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. సెంట్రల్ బాగ్దాద్‌లోని ఓ షాపింగ్ మాల్ వద్ద రెండు కారు బాంబులు పేలడంతో పది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 28 మంది గాయాలపాలైనట్లు పోలీసులు వెల్లడించారు. నఖీల్ మాల్ వెలుపల అర్థరాత్రి సమయంలో పేలుడు పదార్థాలతో కూడిన కార్లలో ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడినట్లు పోలీసు అధికారి తెలిపారు. త్వరలో బక్రీద్ ఉండడం, వారాంతం కావడంతో షాపింగ్ మాల్ అర్థరాత్రి తర్వాత కూడా తెరిచే ఉందని చెప్పారు. షాపింగ్ మాల్ లోపల ఎవ్వరూ గాయపడలేదని, బయట ఉన్న వారిపై ప్రభావం పడిందని అంతర్గత మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి వెల్లడించారు.పది మంది మరణించినట్లు ధ్రువీకరించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. బాగ్దాద్‌లో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు తరచూ దాడులకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్‌లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







