గడువు తీరిన ఆహార పదార్థాల సీజ్
- September 10, 2016
రియాద్: 60,000 కౌంటర్‌ఫీట్ మరియు గడువు తీరిన కన్జ్యూమర్ ఐటమ్స్‌ని మక్కా, మదీనా, తాయిఫ్‌లో అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసినవాటిలో ఫుడ్ ఐటమ్స్, షాంపూలు, డిటర్జెంట్లు, అలాగే ఫుడ్ స్టఫ్ ఉన్నాయి. మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్, హజ్ సందర్భంగా హజ్ యాత్రీకులకు సరైన ఆహార పదార్థాలు, ఇతర కన్జ్యూమర్స్ అందేలా చేసేందుకు, అలాగే నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటిని సీజ్ చేసేందుకు క్యాంపెయిన్స్ నిర్వహిస్తోంది. మినిస్ట్రీ అధికారి ఒకరు సీజ్ చేసిన ఆహార పదార్థాల గురించి వివరిస్తూ, కొన్ని ఆహార పదార్థాల్ని సరైన పద్ధతుల్లో స్టోర్ చేయలేదని, వాటిని సీజ్ చేశామని అన్నారు. మక్కాలో 66 కౌంటర్‌ఫీట్ ఐటమ్స్, 996 వెరైటీస్ ఆఫ్ కౌంటర్ ఫీట్ గూడ్స్‌ని పట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. తైఫ్‌లో 44,000 ప్యాకెట్ల షాంపూలని గడువుతీరినవిగా గుర్తించినట్లు వారు వెల్లడించారు. మదీనాలో 15,000 ఐటమ్స్‌ని సీజ్ చేశారు. వీటిల్లో షాంపూలు, ఫేస్ క్రీమ్స్ ఉన్నాయి. ఈ మధ్యనే 140,000 ఫుడ్ ఐటమ్స్‌ని ఓ వేర్ హౌస్‌లో సీజ్ చేశారు అధికారులు. మినిస్ట్రీ మొబైల్ షాపులపైనా, కమర్షియల్ రిఫ్రిజిరేటర్స్ మరియు ఫుడ్ ట్రక్స్‌పైనా నిఘా పెట్టిందని వారు వివరించారు.
తాజా వార్తలు
- భారత్-న్యూజిలాండ్ మధ్య కుదిరిన ఫ్రీ ట్రేడ్ డీల్
- తిరుమలలో వైకుంఠద్వార దర్శనాలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు
- జనవరి 2 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
- వందే భారత్ స్లీపర్ రైలు ట్రయల్ సక్సెస్…
- చికాగోలో ఘనంగా చలనచిత్ర సంగీత కచేరీ
- సైనిక సిబ్బంది పై దాడి..ఇద్దరు వ్యక్తులు అరెస్ట్..!!
- మహిళా సాధికారత..ఉమెన్ ఇన్స్పైర్ సమ్మిట్..!!
- Dh100,000 చొప్పున గెలిచిన నలుగురు భారతీయులు..!!
- మస్కట్‌లో ఖైదీల ఉత్పత్తుల ప్రదర్శన పై ప్రశంసలు..!!
- ఖతార్‌లో విటమిన్ డి లోపం విస్తృతంగా ఉంది:స్టడీ







